|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 04:18 PM
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు పూర్తిగా పక్కదారి పట్టాయని, ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.గతంలో 'సోమవారం - పోలవారం' అనే నినాదం ఉండేదని, కానీ ఇప్పుడా 'సోమవారం' సంతకు పోయింది అంటూ శ్యామల ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వం 'మంగళవారం - అప్పుల వారం'గా మార్చేసిందని ఆమె తన పోస్టులో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, ప్రాజెక్టులపై కాకుండా అప్పులు చేయడంపైనే దృష్టి సారించిందని ఆమె ఆరోపించారు.
Latest News