|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 03:04 PM
తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. కపిలతీర్థం సమీపంలోని రెండు హోటళ్లకు 4 ఆర్డీఎక్స్ బాంబులతో పేల్చేస్తామని బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. తిరుపతిలోని రాజ్ పార్క్ హోటల్ ఈ బెదిరింపుల బారిన పడింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, ఘటనాస్థలంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో అనుమానాస్పద వస్తువుల కోసం గాలిస్తున్నారు. స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.
Latest News