|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 02:09 PM
రాజ్యసభ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సి. పి. రాధాకృష్ణన్‌కు వైయస్ఆర్‌సీపీ రాజ్యసభ పక్ష నేత సుభాష్ చంద్రబోస్ అభినందనలు తెలిపారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున రాధాకృష్ణన్‌కు శుభాభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ..“రాధాకృష్ణన్ దశాబ్దాలపాటు ఉన్న సంస్థాగత వ్యవహారాల అనుభవం రాజ్యసభను సమర్థంగా నడిపించే విషయంలో ఎంతో ఉపయోగపడుతుంది. దేశంలో అత్యున్నత రెండో పదవికి చేరుకోవడం ప్రజాస్వామ్య గొప్పతనానికి నిదర్శనం. గతంలో గవర్నర్‌గా రాధాకృష్ణన్ చేసిన సేవలు అభినందనీయం. సభా కార్యక్రమాలను నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళతారనే నమ్మకం ఉంది. బాధ్యతాయుత రాజకీయ పార్టీగా వైయస్ఆర్‌సీపీ, సభా కార్యక్రమాల నిర్వహణలో పూర్తిస్థాయిలో సహకరిస్తుంది” అని పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు.
Latest News