|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 12:14 PM
ఏపీలోని అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అంగళూరు వద్ద గండిపోచమ్మ ఆలయానికి వెళ్లి వస్తుండగా ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, పాలకొల్లుకు చెందిన 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి నిమ్మల రామ్మోహన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
Latest News