|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 12:19 PM
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు, తమిళనాడులోని శ్రీరంగం శ్రీరంగనాథస్వామివారి ఆలయంలో సోమవారం నాడు పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ జాయింట్ కమిషనర్ పి. శివరామన్, ప్రధానార్చకులు సుందరభట్టర్ టిటిడి చైర్మన్ కు ఘన స్వాగతం పలికారు. చైర్మన్ తన దంపతులతో కలిసి పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి సమర్పించారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు చైర్మన్ కు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Latest News