|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 11:58 AM
జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నివేదిక ప్రకారం, ఐటీ రంగ ఉద్యోగుల్లో హెచ్ఐవీ కేసులు పెరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ సంక్రమణ శాతం పెరుగుతోందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాల ఎయిడ్స్ నియంత్రణ సొసైటీలకు సూచించారు. తెలంగాణలో గత ఏడాదితో పోలిస్తే హెచ్ఐవీ సంక్రమణ రేటు 0.44 నుంచి 0.41కు తగ్గినప్పటికీ, ఐటీ రంగంలో పెరుగుదలకు విదేశీ జీవనశైలి, వీకెండ్ పార్టీలు, అరక్షిత శృంగారం, డ్రగ్స్, మద్యం వంటివి కారణాలుగా చెబుతున్నారు. తక్షణ గర్భనిరోధక మాత్రల లభ్యత కూడా అరక్షిత శృంగారాన్ని పెంచిందని నివేదిక పేర్కొంది.
Latest News