|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 10:51 AM
శ్రీశైలం మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో సోమవారం నుంచి భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం అందజేయడం ప్రారంభం కానుంది. అతిశీఘ్ర దర్శనం టికెట్ (రూ. 300) తీసుకున్న వారికి ఒక లడ్డూ, స్వామివారి స్పర్శ దర్శనం (రూ. 500) టికెట్ దారులకు రెండు లడ్డూలు ఉచితంగా ఇస్తారు. అదనంగా డొనేషన్ కౌంటర్, ఛైర్మన్ ఛాంబర్, కైలాస కంకణాల కేంద్రం ప్రారంభం చేయడంతో పాటు శ్రీగోకులం ఆధునికీకరణ పనులకు భూమి పూజ నిర్వహించనున్నారు.
Latest News