|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 10:22 AM
గుంటూరు అర్బన్ టీడీపీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ, తప్పు చేసిన వారు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లక తప్పదని, టీడీపీ వారితో సహా ఎవరైనా శిక్షార్హులేనని అన్నారు. మొత్తం 34మందికి రూ. 23.08లక్షల రూపాయల చెక్కులు అందజేసినట్లు తెలిపారు. పార్టీలకతీతంగా సీఎంఆర్ఎఫ్ కింద సాయం చేస్తున్నామని, ఇందులో 50శాతానికి పైగా మైనార్టీలకు సాయం చేశామని పేర్కొన్నారు. తన పనితీరుపై 75శాతం మంది సంతృప్తిగా ఉన్నారని ఒక రిపోర్ట్ వచ్చిందని, భవిష్యత్తులో వందశాతం ప్రజలకు చేరువయ్యేలా పని చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి శుక్రవారం టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ ఉంటుందని, సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తామని తెలిపారు.
Latest News