|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 07:18 PM
నవంబర్ నెల ముగిసింది. డిసెంబర్ నెల వచ్చేసింది.. అదిగో, ఇదిగో అనేలోపు కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. కొత్త ఏడాది, కొత్త రెజల్యూషన్స్.. కొత్త లక్ష్యాలు, కొత్త ఆశయాలతో సందడి చేయాలని ఇప్పటి నుంచే అందరూ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు అందరిలోనూ ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది. ఉద్యోగులు అయితే ఏడాది పొడవునా దాచి ఉంచుకున్న లీవ్స్ వాడేయడానికి ప్లాన్ చేస్తుంటారు. విద్యార్థులు అయితే చలికాలాన్ని ఎంజాయ్ చేస్తూ న్యూ ఇయర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. విద్యార్థులు, ఉద్యోగులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రతి నెలా ఫాలో అయ్యే కామన్ పాయింట్ ఒకటుంది.. అదే సెలవులు.. డిసెంబర్ నెల వచ్చేయటంతో.. ఈ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయి.. ఎన్ని ఆప్షనల్ హాలీడేస్ ఉన్నాయనే సంగతిపై ఓ లుక్కేద్దాం.
డిసెంబర్ నెలలో మొత్తం ఆరు రోజులు సెలవులు రానున్నాయి. వీటికి అదనంగా ఓ ఆప్షనల్ హాలీడే వచ్చే అవకాశం ఉంది. దీంతో డిసెంబర్ నెలలో మొత్తం వర్కింగ్ డేస్ 25 రోజులు అన్నమాట. డిసెంబర్ నెల విశేషం ఏమిటంటే వీకెండ్ సెలవులు పండగతో కలిపి రావటంతో లాంగ్ ట్రిప్స్ ప్లాన్ చేసుకునేవారికి బాగా ఉపయోగపడనుంది.
డిసెంబర్ నెలలో సాధారణ సెలవులు
07-12-2025 ఆదివారం
13-12-2025 రెండో శనివారం
14-12-2025 ఆదివారం
21-12-2025 ఆదివారం
25-12- 2025 క్రిస్మస్ (గురువారం)
26-12-2025 బాక్సింగ్ డే (ఆప్షనల్ హాలీడే)
27-12 -2025 నాలుగో శనివారం
28-12 -2025 ఆదివారం
మరోవైపు క్రిస్మస్ పండుగ డిసెంబర్ 25వ తేదీ గురువారం వస్తుంది. డిసెంబర్ 26న బాక్సింగ్ డే సందర్భంగా ఆప్షనల్ హాలీడే ఉంటుంది. ఒకవేళ ఆప్షనల్ హాలీడే లేని పక్షంలో వారు సెలవు తీసుకుంటే .. డిసెంబర్ 27 నాలుగో శనివారం. డిసెంబర్ 28 ఆదివారం ఉన్నాయి. దీంతో మొత్తం నాలుగు రోజుల పాటు సెలవులు లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో లాంగ్ ట్రిప్స్ ప్లాన్ చేసే వారికి మంచి అవకాశం. మరోవైపు ఇయర్ ఎండింగ్ కావటంతో ఉద్యోగులు కూడా తమ సెలవులను ఉపయోగించుకునేందుకు ప్లాన్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లేందుకు ఈ సెలవులు మంచిగా ఉపయోగపడనున్నాయి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. బాక్సింగ్ డే ఆప్షనల్ హాలీడే అన్ని సంస్థలలోనూ ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
Latest News