|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 02:02 PM
వాషింగ్టన్ డీసీలో ఆఫ్ఘన్ మూలాలున్న వ్యక్తి జరిపిన కాల్పుల ఘటన అమెరికాలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆఫ్ఘన్ వలసదారులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. అయితే, ఒక వ్యక్తి చేసిన తప్పుకు యావత్ ఆఫ్ఘన్ సమాజాన్ని బలిపశువును చేయడం అన్యాయమని అమెరికా మాజీ సైనికుడు అహ్మద్ షా మోహిబి తీవ్రంగా వ్యతిరేకించారు.కాల్పుల ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ట్రంప్ స్పందిస్తూ.. ఆఫ్ఘన్ జాతీయులకు గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆఫ్ఘనిస్థాన్‌ను ఒక "నరక కూపం"గా అభివర్ణించారు. దీంతో పాటు ఆఫ్ఘనిస్థాన్, మయన్మార్, ఇరాన్, వెనెజువెలా సహా 19 దేశాల నుంచి వచ్చిన వలసదారుల వివరాలపై విస్తృత సమీక్షకు ఆదేశాలు జారీ చేశారు.ట్రంప్ చర్యలను మోహిబి తప్పుబట్టారు. "ఒక వ్యక్తి తుపాకీతో దాడి చేసినంత మాత్రాన ఆఫ్ఘన్ ప్రజలంతా ఉగ్రవాదులు కాదు. అందరినీ శిక్షించడం సరికాదు" అని ఆయన అన్నారు. 2021లో అమెరికా సేనల ఉపసంహరణ సమయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులే ప్రస్తుత సమస్యలకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా వలసల విధానం పూర్తిగా విఫలమైందని... పది మంది ట్రంప్‌లు వచ్చినా ఈ సమస్యను పరిష్కరించలేరని ఆయన వ్యాఖ్యానించారు.
Latest News