|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 02:00 PM
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) తీవ్రంగా ఖండించింది. ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారని, రావల్పిండిలోని అదియాలా జైలులో క్షేమంగా ఉన్నారని పీటీఐ సెనేటర్ ఖుర్రం జీషన్ స్పష్టం చేశారు. ఇమ్రాన్‌ను దేశం విడిచి వెళ్లేలా ఒత్తిడి చేసేందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.జీషన్ మాట్లాడుతూ... "ఇమ్రాన్ ఖాన్ జనాదరణ చూసి ప్రస్తుత ప్రభుత్వం భయపడుతోంది. అందుకే ఆయన ఫొటోలు గానీ, వీడియోలు గానీ బయటకు రాకుండా జాగ్రత్త పడుతోంది. గత కొన్ని రోజులుగా ఆయన బతికే ఉన్నారని, జైలులో క్షేమంగా ఉన్నారని మాకు హామీ లభించింది" అని తెలిపారు.
Latest News