|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 01:40 PM
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్)లో శనివారం జరిపిన ఆకస్మిక తనిఖీ తీవ్ర కలకలం రేపింది. ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆయన ఒక సాధారణ రోగిలా ఆసుపత్రికి రావడంతో వైద్య సిబ్బంది విస్తుపోయారు.శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సౌరభ్ గౌర్ జీజీహెచ్ ఓపీ విభాగానికి చేరుకున్నారు. తనకు జ్వరంగా ఉందని చెప్పి ఓపీ చీటీ తీసుకున్నారు. అనంతరం వైద్యుడిని సంప్రదించి, తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ఆ తర్వాత ఫార్మసీ వద్ద సాధారణ రోగులతో పాటు క్యూలో నిల్చుని మందులు కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో దాదాపు గంట పాటు ఆయన ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు.గంట తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల నుంచి జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది హుటాహుటిన సౌరభ్ గౌర్ వద్దకు పరుగులు తీశారు. అప్పటికే ఆయన ఆర్థోపెడిక్ ఓపీ వద్ద ఉన్నారు. సూపరింటెండెంట్ వచ్చి నమస్కరించడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.
Latest News