BOIలో 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈరోజే ఆఖరు ఛాన్స్! లక్ష నుంచి 1.2 లక్షల వరకు జీతం
 

by Suryaa Desk | Sun, Nov 30, 2025, 12:04 PM

బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) ఐటీ, డేటా సైన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో 115 చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ స్థాయి స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అవకాశం నేటి (నవంబర్ 30, 2025)తో ముగియబోతోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.
అర్హతల విషయానికొస్తే B.Tech / BE (ఏ బ్రాంచ్ అయినా), M.Sc (స్టాటిస్టిక్స్/డేటా సైన్స్/ఐటీ), MCA వంటి కోర్సులు పూర్తి చేసినవారు అప్లై చేయొచ్చు. పోస్టు బట్టి కనీస వయసు 22 నుంచి గరిష్టంగా 45 ఏళ్ల వరకు ఉండాలి. SC/ST/OBC/EWS/PwBD అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయసు సడలింపు వర్తిస్తుంది.
ఎంపికైన అభ్యర్థులకు స్కేల్-2 నుంచి స్కేల్-4 వరకు జీతం రూ.64,820 నుంచి రూ.1,20,940 వరకు ఉంటుంది. ఇందులో DA, HRA, స్పెషల్ అలవెన్స్‌లు కూడా జత అవుతాయి. ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ రాత పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు జనరల్/OBC/EWS వారికి రూ.850 మరియు SC/ST/PwBD వారికి రూ.175 మాత్రమే. దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే సమర్పించాలి. అధికారిక వెబ్‌సైట్: https://bankofindia.co.in/careers ఈ లింక్‌లోకి వెళ్లి ఈరోజు సాయంత్రం 11:59 గంటల లోపు అప్లై చేసుకోండి – ఛాన్స్ మిస్ చేసుకోకండి!

Latest News
India's exports rebound stronger in November Thu, Dec 04, 2025, 05:08 PM
Rise and fall of first time Congress Kerala MLA Rahul Mamkootathil Thu, Dec 04, 2025, 05:07 PM
Chhattisgarh: 'Maths Park' ignites passion for subject among children Thu, Dec 04, 2025, 05:05 PM
Jaipur Open 2025: Yuvraj Sandhu fires 66 to establish three-shot lead after round three Thu, Dec 04, 2025, 04:56 PM
S&P upgrades India's insolvency regime on stronger creditor protection Thu, Dec 04, 2025, 04:54 PM