|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 11:47 AM
సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ vs బెంగాల్ మ్యాచ్ ఒక్కసారిగా ఏకపక్ష వ్యవహారంగా మారింది. హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఈ పోరులో పంజాబ్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ బెంగాల్ బౌలర్లను చీల్చి చెండాడుతున్నారు. కేవలం 11.5 ఓవర్లలోనే వికెట్ నష్టం లేకుండా 193 రన్స్ చేరడం ఈ మైదానంలో ఎప్పుడూ చూడని దృశ్యం.
కెప్టెన్ అభిషేక్ శర్మ ఈ రోజు పూర్తిగా ఆగ్రాసివ్ మూడ్‌లో కనిపించాడు. 12 బంతుల్లోనే అర్ధశతకం బాది, కేవలం 20 బంతుల తేడాతోనే సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం 40 బంతుల్లో 124* (7 ఫోర్లు, 14 సిక్సర్లు)తో క్రీజులో ఉన్న ఈ లెఫ్ట్ హ్యాండర్ బంతిని చూస్తే సిక్సర్, చూస్తే సిక్సర్ అన్నట్టుగా కొనసాగుతున్నాడు. బెంగాల్ బౌలర్లు ప్లాన్ ఏమీ పని చేయకపోవడంతో వీరిద్దరూ రెచ్చిపోయారు.
మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కూడా ఏ మాత్రం వెనకంజ వేయలేదు. 32 బంతుల్లోనే 64 రన్స్ సాధించిన ఈ యంగ్ ఓపెనర్ అభిషేక్‌తో కలిసి రెండు వందల భాగస్వామ్యాన్ని దాటేసే దిశగా దూసుకెళ్తున్నాడు. ఇద్దరూ కలిసి ఇప్పటివరకు 19 సిక్సర్లు బాదారు – ఇది టీ20 క్రికెట్‌లోనే అరుదైన దృశ్యం.
ఈ రన్ రేట్ (16.70+) చూస్తుంటే పంజాబ్ 300 దాటే అవకాశం కూడా లేకపోలేదు. బెంగాల్ జట్టు ఇప్పుడు పూర్తిగా నిరాశలో మునిగిపోయింది. అభిషేక్ శర్మ ఈ ఒక్క ఇన్నింగ్స్‌తోనే SMAT 2025 సీజన్‌ను తనదైన మార్క్ చేస్తున్నాడు!