30.11.2025 నుండీ 06.12.2025 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
 

by Suryaa Desk | Sun, Nov 30, 2025, 07:32 AM

మేషరాశి.... (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ, లూ, లే, లో,ఆ)వారం ప్రారంభంలో పని ఒత్తిడి అలసట అధికంగా ఉంటాయి వృత్తిపరమైన బాధ్యతలు. అనుకోని ప్రయాణాలు కొంత ఇబ్బంది పడతాయి. తల్లి ఆరోగ్యం కుటుంబ పరమైన ఖర్చులు, వారము మధ్యలో పౌరుషం పెరుగుతుంది పంతం గా నిర్ణయాలు తీసుకుంటారు. చురుకుగా ఆలోచిస్తారు. స్నేహితుల సహకారం. బంధువులతో ప్రయాణాల కొరకు ఆలోచనలు చేస్తారు. ఆర్థిక విషయాలు, భాగస్వామితో అనుకూల వాతావరణం, వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు కమ్యూనికేషన్ అనుకూలం. పూర్వపు రుణాలు తీరుస్తారు. విద్యాపరంగా కాన్సన్ట్రేషన్ ని పెంచుకోవాలి. వారం చివరిలో ఉన్నత విద్యా పరంగా, విదేశీ వ్యవహారాలకు సంబంధించి తండ్రి సహకారం ఆశీస్సులతో అనుకున్న పనులు సాధించడానికి గట్టిగా నిర్ణయించుకుంటారు. మరిన్ని మంచి ఫలితాల కొరకు దత్తాత్రేయుని ఆరాధన దేవాలయ సందర్శన మంచిది


వృషభరాశి...(కృతిక 2,3,4,రోహిణి 1 2 3 4,మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)  వారం ప్రారంభంలో చాలా ఆశాజనకంగా, ఆనందదాయకంగా చిన్ననాటి మిత్రుల కలయిక, గోష్టి, విద్య, విందు వినోదాలు, ఎదురుచూసిన వర్తమానాలు అందుకోవడం వృత్తిపరమైన అభివృద్ధి ఆత్మీయుల సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి శ్రీకారం చుడతారు. బద్ధకాన్ని అధిగమించాలి. వ్యక్తిగత ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వారం మధ్యలో మిత్రులతో కలిసి సాహసోపవంతమైన ప్రయాణాలు చేయడానికి ఆలోచనలు చేస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులు స్థిరాస్తులు పెంపుదల, గృహ వాహనాల గురించి ఆలోచనలు ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా చుట్టూ ముడతాయి. ఆలోచనలను అనుకూల,వ్యక్తిగత శ్రద్ధ , ఆకర్షణ పెరుగుతుంది విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ వ్యక్తులతో కమ్యూనికేషన్ విషయంలో చక్కని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళతారు. వారం చివరిలో మాట విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి మిత్రులు శ్రేయోభిలాషుల కొరకు ఖర్చు పెడతారు దగ్గర ప్రయాణాలు కొరకు ఆలోచనలు చేస్తారు. మంచి ఫలితాల కొరకు విష్ణు సహస్రనామ పారాయణ, శ్రవణ మేలు.


మిధున రాశి...(మృగశిర 3 4,ఆరుద్ర 1 2 3 4,పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)  


వారం ప్రారంభంలో వృత్తిపరమైన విషయాలలో బద్దకాన్ని అధిగమించాలి పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు ఆర్థిక విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి వృత్తిపరమైన ఆదాయం విషయంలో అధిక శ్రమతో ముందుకు వెళతారు. ముఖ్యమైన పనులు వాయిదా పడ్డం వల్ల మానసిక ఘర్షణ ఉంటుంది కనుక ప్రశాంతతను అవలంబించాలి. వారం మధ్యలో ఆర్థిక విషయాలు, వృత్తి పరమైన అధిక ఆదాయాన్ని అందుకొనడంలో ఆనందాన్ని చూస్తారు. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి వ్యక్తుల సహకారాన్ని పూర్తిగా పొందగలరు, తోబుట్టువుల తో కలిపి నిర్ణయాలు చేస్తారు. పూర్వ రుణాలని పొందగలరు. అధిక ఖర్చులు అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. సంతాన వర్గం కొరకు, మీ అభిరుచుల కొరకు ధనాన్ని వెచ్చిస్తారు. వారం చివరిలో వృత్తిలో మాట విలువ గౌరవం పెరుగుతాయి. అధిక బాధ్యతలతో ఇతరులకు సహకారాన్ని అందిస్తారు. మరిన్ని మంచి ఫలితాల కొరకు శ్రీకృష్ణ మందిరాలు దర్శించడం మేలు.


కర్కాటక రాశి...(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)


వారం ప్రారంభంలో ఆధ్యాత్మిక దూర ప్రయాణాలు అవకాశం, మానసిక సంతోషాన్ని పెంపొందించుకోవడానికి దేవాలయ దర్శనలు. వ్యాపార పరమైన అభివృద్ధి విషయంలో సామాన్య ఫలితాలు. ప్రయాణాలలో వ్యక్తుల యొక్క పరిచయాలు, సౌకర్యాలలో లోపాలు కొత్త ఘర్షణాత్మకంగా ఉంటాయి. వృత్తిపరమైన విషయాలలో నూతన నిర్ణయాలు, ప్రయాణాలు. ఆత్మీయులైన మిత్రులు తోబుట్టువులతో చర్చలు. వారం మధ్యలో ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి, వృత్తి, సంతానం వారి అభివృద్ధి, కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం ఆర్థిక అంశాలు కొంతవరకు లాభసాటిగా ఉంటాయి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. ముఖ్యంగా వాహనాలకు సంబంధించి, స్థిరాస్తుల విషయంలోనూ, గృహ సంబంధ అంశాల్లోనూ మార్పులు చేర్పులలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారం చివరిలో వ్యక్తిగత ఆరోగ్యం కొరకు ఖర్చులు, శ్రద్ధ. దినచర్యలో మార్పులు. దైవ సంబంధమైన మంచి ఖర్చులు చేయడానికి ముందుకు వెళతారు. మరిన్ని మంచి ఫలితాల కొరకు సత్యనారాయణ స్వామి యొక్క ఆరాధన, దేవాలయ సందర్శన మంచిది


సింహరాశి...(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం) (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)


వారం ప్రారంభంలో ఆకస్మిక ఖర్చులను, ఆరోగ్య సంబంధమైన విషయాలని, వ్యాపార పెట్టుబడుల కొరకు చేసే ఆలోచనలని మొదలైన ముఖ్య విషయాలపై తగ్గిన విధంగా దృష్టి సారించాలి. భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలోనూ, వ్యాపార విస్తరణ దూర ప్రదేశాలలో విషయంలోనూ, కుటుంబ ఆర్థిక విషయాలలో ప్రణాళిక రహిత ఖర్చులలో జాగ్రత్తలు తీసుకోవాలి. వారం మధ్యలో దూర ప్రయాణాలకు, ఉన్నత విద్య, తల్లి తండ్రి సంబంధించిన ఖర్చులు. స్థిరాస్తులు పెంపొందించు కోవడానికి, వ్యవసాయ భూములకి ఆలోచన చేస్తారు. వృత్తిపరమైన మార్పులు, అధిక ఆత్మవిశ్వాసం, కుటుంబంలో ఘర్షణాత్మకమైన వాతావరణం మొదలైన వాటిలో ఆచితూచి వ్యవహరించాలి. వారాంతంలో మానసిక ప్రశాంతత పెరుగుతుంది. పూర్వపు పెట్టుబడుల ల మీద ఆదాయం కొరకు ఆలోచనలు చేస్తారు. సంతాన అభివృద్ధికరంగా ముందుకు వెళుతుంది. తోబుట్టువులతో కలిపి చక్కటి చర్చలు చేస్తారు. ప్రయాణాల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు మరిన్ని మంచి ఫలితాల కొరకు దుర్గాదేవి ఆరాధన దేవాలయ సందర్శన మంచిది.


కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4,హస్త 4,చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో)


లో సాంఘిక సంబంధాలు మైత్రి బంధాల విషయంలో అధిక శ్రద్ధ తీసుకుంటారు సంతాన వర్గంతో చర్చలు చేస్తారు అభిప్రాయ బేధాలకి దూరంగా ఉండాలి. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలలో అధిక శ్రమతో అనుకున్నవి సాధించగలుగుతారు. నిరుద్యోగులకు వృత్తి కొరకు దూర ప్రదేశాలలో అధిక ప్రయత్నాలు చేస్తారు. భాగస్వామితో కలిపి కొత్త ప్రదేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు. అందించిన ప్రదేశాలలో గౌరవాన్ని పెంపొందించుకుంటారు. వారం మధ్యలో ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి సమయానికి ఆహార స్వీకరణ, నిద్రలేమిని అధిగమించాలి. ఆత్మీయులైన వ్యక్తులతో తోబుట్టువులతో ఇగో ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణాలలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి. చివరిలో ఉన్నత విద్య కొరకు విదేశాలకి ప్రయత్నాలు. పెద్దల సహకారం. మంచి ఫలితాలు కొరకు పరమేశ్వర ఆరాధన ,దేవాలయ సందర్శన మంచిది.


తులా రాశి...(చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)    


వారం ప్రారంభంలో ప్రత్యర్థుల మీద, రోగ రుణముల మీద విజయాన్ని సాధించడానికి అధికంగా శ్రమ తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, పాత రుణములను పూర్తి చేస్తారు. ఆరోగ్య శ్రద్ధ తీసుకుంటారు. వృత్తిపరమైన విషయాలలో అత్యధిక శ్రమ బాధ్యతలు పెరుగుతాయి. వారము మధ్యలో భాగస్వామ్య వ్యవహారాలు మీద దృష్టి సారిస్తారు. జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు అపార్థాలకు దూరంగా ఉండాలి, వ్యక్తిగత అంశాలలో శ్రద్ధ, ఆకస్మిక దూర ప్రయాణాలు మొదలైన వాటి ప్రస్తావన కుటుంబ పెద్దలతో. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు, నిర్ణయాలు ,ఆలోచనలుముఖ్య విషయాలలో వాయిదాలు , మానసిక ప్రశాంతత తగ్గుదల. వారం చివరిలో పెద్దలతో అభిప్రాయ బేధాలకు దూరంగా ఉండాలి. వ్యాపారంశాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి. ఉన్నత విద్య దూర ప్రయాణాలు సామాన్య ఫలాలు. మంచి ఫలితాల కొరకు విఘ్నేశ్వర పూజ దేవాలయ సందర్శన మంచిది.


వృశ్చిక రాశి...(విశాఖ 4,అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)   


వారం ప్రారంభంలో మానసిక ప్రశాంతతలో అలజడి, సంతాన వర్గంతో ఘర్షణ, జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి, ఆత్మీయులైన వ్యక్తులతో, కుటుంబ సభ్యులతో చర్చలు, దూర ప్రయాణాలు. ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆలోచనలు ఖర్చులు ,ప్రయాణాలు ఘర్షణాత్మకంగా ఉన్న కొంత ఉపశమనంగా ఉంటాయి. ప్రయాణంలో సౌకర్యాలు తక్కువ. వారం మధ్యలో ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు, రోగములు. రుణముల విషయంలో తగిన జాగ్రత్తలతో ఉంటారు. నిరోధక శక్తిని పెంపొందించుకుంటూ, అధిక శ్రమతో ముందుకు వెళతారు. ఇబ్బంది పెట్టే రహస్యశత్రువులని గమనిస్తారు. జీవిత భాగస్వామి వృద్ధి పలుకుబడి మానసిక ఆనందాన్నిస్తుంది. భాగస్వామికి మంచి అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో తండ్రి యొక్క ఆరోగ్య మీద శ్రద్ధ తీసుకుంటారు, వారికి సంబంధించిన ఖర్చులు, డ్రైవింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి. కుటుంబ సభ్యులతో, వృత్తి చేసే ప్రదేశాలలో పై అధికారులతో మాట పట్టింపులకి అభిప్రాయ బేధాలకి దూరంగా ఉండాలి. మరిన్ని మంచి ఫలితాల కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. దేవాలయ సందర్శన మంచిది


ధను రాశి...(మూల 1 2 3 4,పూర్వాషాఢ 1 2 3 4,ఉత్తరాషాఢ 1వ పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)


ఆలస్యాలు, ఖర్చులు అధికం.తల్లి, కుటుంబం వారితో అపార్ధలకి, విద్యాసంబంధ అంశాలలో ఆటంకలకి, ఖర్చులకి అవకాశం. సంతాన ఖర్చులు. వ్యవసాయ, భు పెట్టుబడులకి ఆలోచనలు.సంతానం, భాగస్వామితో, మరియు వ్యాపార విషయాల్లో మాట పట్టింపులు కి దూరం ఉండాలి. వారం మధ్యలో రుణాలు తీరుస్తారు. వృత్తికి సంబంధ అభివృద్ధి, మార్పులు, చర్చలు. స్త్రీలతో ఘర్షనకి దూరం అవసరం. రహస్య శత్రువులు ఇబ్బందిపేట్టే ప్రయత్నాలు చేస్తరు. వ్యసనములకి దూరం మంచిది. అనవసర ఖర్చులు, ప్రయాణాలు, వృత్తిలో ఘర్షనాత్మక వాతావరణలు అదిగమించాలి. కోపాన్ని నియంత్రించాలి.వారంతములో భాగస్వామి ఆరోగ్యంలో జాగర్తలు.మరిన్ని మంచిఫలితాములకి హనుమాన్ చాలీసా, దేవాలయ సందర్శన మంచిది.


మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి)


వారం ప్రారంభం లో శక్తిసామర్ధ్యలతో అనుకున్న పనులు పూర్తిచేస్తారు. బధకాన్ని అధిగమిస్తారు. శత్రువులపై విజయసాధన. నిర్ణయసా మర్ధ్యం. ఆలోచనల్లో ఆలస్యలున్న అనుకున్న పనులు పూర్తి. భాగస్వామి కొరకు సౌకర్యాలు, గృహ, వాహన అంశాలలో కొనుగోలు చర్చలు. స్థిరస్తులపై ఆదాయములు. తల్లి, విద్య, గృహ సంబంధ అంశాలపై శ్రద్ధ. విద్యార్థుల్సకి అనుకూలం. అభివృద్ధి. పోటీ పరీక్షలలో ముందజా. పై అధికారులతో సహకారం, ప్రశంసలు. సంతానం అభివృద్ధి. ప్రియమైన వారితో సమయాన్ని విందువినోదలకి కేటీయింపు. విశ్రాంతి. వారంతములో ప్రత్యార్థులపై విజయం. నూతన విద్య ఉద్యోగ అవకాశములు. భాగస్వామి అనుకూలం,, వ్యాపార రంగాల్లో అభివృద్ధి. మరిన్ని మంచి ఫలితలకి దత్తాత్రేయని ఆరాధన మంచిది.


కుంభ రాశి...(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)    


వారం ప్రారంభం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి కృషి, మాటవిలువ తగ్గకుండా గౌరవాన్ని పెంపొందించుకుంటారు. ఆర్ధిక విషయాల్లో ఆలస్యాలు ఆటంకాలు. అయినప్పటికి అవసరానికి దాచిన పూర్వపుధనం తో ప్రస్తుత పనులు చేసుకుంటారు.వారం మధ్యలో అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. వృత్తిపరమైన అభివృద్ధి, పెద్దల సహకారం, ఆలోచనలు అనుకూలిస్తాయి. విద్యార్థులకి అనుకూలమైన సమయం, కమ్యూనికేషన్ బాగుంటుంది. హాస్టల్ వసతి కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ సౌఖ్యం అనుకూలం. తల్లి ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ. వృత్తి చేసే ప్రదేశాలలో మీ పై అధికారుల స్త్రీలైతే వృత్తిపరంగా వారి సహకారం కోరుకునేటప్పుడు వినయంగా ముందుకు వెళ్లాలి. వృత్తి వ్యాపారాలు అనుకూలం. వారం చివరిలో ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. సంతాన అభివృద్ధి. ఆలోచనలు ఫలిస్తాయి. ఆగిన ధనం సమయానికి అందుతుంది. వ్యాపారంలో అభివృద్ధి. మరిన్ని మంచి ఫలితాలు కొరకు సూర్యనారాయణస్వామి ఆరాధన మేలు


మీన రాశి...(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర 1 2 3 4,రేవతి 1 2 3 4 పాదాలు)(నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)


వారం ప్రారంభంలో బద్ధకంతో ముఖ్యమైన పనులలో వాయిదాలు వేస్తూ వస్తారు. ఆలోచనలలో ఆలస్యల వల్ల మంచి అవకాశాల్ని కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. పాత విషయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రశాంత తను కోల్పోకూడదు. వారం మధ్యలో ఆర్థిక విషయాలలో తండ్రి యొక్క,సహకారాన్ని ఆశిస్తారు. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి, ముఖ్యంగా తలనొప్పి కంటికి సంబంధించిన అనారోగ్యాలు ఇబ్బంది పెట్ట అవకాశాలు. ఉన్నతాధికారులతో,తండ్రి, పెద్దలతో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా జాగ్రత్త పడాలి. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసుకుంటారు. ఆత్మీయులైన వ్యక్తుల ద్వారా బహుమానాలు అందుకుంటారు. వృత్తి చేసే ప్రదేశాలలో మీ తోటి కొలీగ్స్ తో, లేదా కుటుంబంలో మీ యొక్క సోదర వర్గంతో వివాదాలకు దూరంగా ఉండాలి. వారం చివరిలో స్వగ్రామ సందర్శన కొరకు ప్రయత్నం. వృత్తిపరంగా వ్యక్తిగత అభివృద్ధి గౌరవాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. విద్యార్థులు విద్యా విషయంలో తగిన నైపుణ్యాలని, ఆసక్తిని పెంచుకోవాలి. మరిన్ని మంచి ఫలితాలు కొరకు నవగ్రహ దేవాలయ సందర్శన మంచిది.


 


(గమనిక: గోచార రీత్యా చెప్తున్న రాశి ఫలితాలు జనరల్ వి, వ్యక్తిగతంగా ఉద్దేశించి చెబుతున్నవి కావు, వ్యక్తిగత జన్మజాతకంలో అనగా వ్యక్తి జన్మ కుండలి (జన్మించిన సమయం, తేదీ, ప్రదేశం ఆధారంగా నిర్మించేది) ప్రకారం నడిచే దశలు అంతర్దశలు ప్రధానంగా చూసుకుంటూ ఆ దశ అంతర్దశలకు సంబంధించిన దానికి తగిన పరిహారాలు పాటించుకుంటూ, దానితో పాటు ఈ గోచార ఫలితాలను చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు).


 


 


డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani


జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant


email : padma.suryapaper@gmail.com


www.padmamukhi.com

Latest News
India's exports rebound stronger in November Thu, Dec 04, 2025, 05:08 PM
Rise and fall of first time Congress Kerala MLA Rahul Mamkootathil Thu, Dec 04, 2025, 05:07 PM
Chhattisgarh: 'Maths Park' ignites passion for subject among children Thu, Dec 04, 2025, 05:05 PM
Jaipur Open 2025: Yuvraj Sandhu fires 66 to establish three-shot lead after round three Thu, Dec 04, 2025, 04:56 PM
S&P upgrades India's insolvency regime on stronger creditor protection Thu, Dec 04, 2025, 04:54 PM