|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 05:54 PM
ప్రజలు తమపై ఉంచిన నమ్మకంతోనే కూటమి ప్రభుత్వం 94 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించిందని చంద్రబాబు అన్నారు. వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై ఉందని గుర్తుచేశారు. "డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తున్నాం. కేంద్రం సహకారం లేకుంటే ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి ఉండేది. విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుతామని, పునర్నిర్మిస్తామని ఎన్నికల ముందు ప్రజలకు మాటిచ్చాం. ఏడాదిలోనే అన్నీ చేశామని మేం చెప్పడం లేదు. కానీ ఊహించిన దానికంటే ఎక్కువే చేశాం" అని ముఖ్యమంత్రి వివరించారు. తాను క్లిష్టమైన సమయంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని, గతంలో 1995, 2014లలో కూడా ఆర్థిక సవాళ్లను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించానని గుర్తు చేశారు.
Latest News