|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 05:46 PM
అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన బ్లాక్ బాక్స్‌ను విశ్లేషణ కోసం విదేశాలకు పంపారంటూ వస్తున్న వార్తలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఖండించారు. బ్లాక్ బాక్స్ భారత్‌లోనే ఉందని, ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దానిని పరిశీలిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఫిక్కీ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన 'హెలికాప్టర్స్ అండ్ స్మాల్ ఎయిర్‌క్రాఫ్ట్ సమ్మిట్ 2025' (హెలికాప్టర్లు, చిన్న విమానాల సదస్సు 2025) సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "బ్లాక్ బాక్స్‌ను విదేశాలకు పంపారనేవన్నీ కేవలం ఊహాగానాలే. బ్లాక్ బాక్స్ భారత్‌లోనే ఉంది. ప్రస్తుతం దీనిని ఏఏఐబీ విచారిస్తోంది," అని ఆయన స్పష్టం చేశారు.
Latest News