|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 12:44 PM
మద్యం స్కాం కేసు దర్యాప్తులో సిట్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి నోటీసులు జారీచేసింది. బుధవారం విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు మద్యం సొమ్మును వైసీపీ నాయకత్వం తమ అభ్యర్థులకు అందజేసినట్లు దర్యాప్తు బృందం ఆధారాలు సేకరించింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన 43 మంది అసెంబ్లీ అభ్యర్థులు, నలుగురు లోక్‌సభ అభ్యర్థులకు చెవిరెడ్డి ద్వారా పంపిణీ చేయడానికి ఆ డబ్బును తుడా అధికారిక వాహనాల్లో తరలించినట్లు సిట్ పలు టోల్‌గేట్లలో సీసీ ఫుటేజీ సంపాదించింది. ఇదే సమయంలో తుడా వాహనాలు పరిధి దాటి వెళ్లలేదని అధికారిక లాగ్ బుక్‌లో నమోదైంది. రెండింటినీ పరిశీలించిన దర్యాప్తు అధికారులు.. అధికారిక వాహనాలను ఎన్నికల్లో డబ్బులు తరలించేందుకు వినియోగించిన అప్పటి తుడా చైర్మన్ మోహిత్‌రెడ్డిని ఇటీవల ఈ కేసులో 39వ నిందితుడిగా చేర్చింది. ఈ నేపథ్యంలో ఆయన్ను విచారణకు పిలువడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Latest News