అమ‌రావ‌తి రెండో ద‌శ‌ ల్యాండ్ పూలింగ్ కి సన్నాహాలు
 

by Suryaa Desk | Tue, Jun 24, 2025, 12:38 PM

ఏపీ మంత్రివర్గం మంగళవారం ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. అమ‌రావ‌తి రెండో ద‌శ‌లో 44 వేల ఎక‌రాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేక‌రించే అంశంలో క్యాబినెట్‌లో చ‌ర్చించే అవ‌కాశం ఉన్నట్లు తెలియవచ్చింది. రాష్ట్రంలో ప‌లు సంస్థ‌ల‌కు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపే అవ‌కాశం ఉన్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాల‌న పూర్తి అయిన సంద‌ర్భంగా క్యాబినెట్‌లో చ‌ర్చించనున్నారు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాల‌సీపై చ‌ర్చించి అమోదించే అవకాశం ఉంది. ఆంధ్ర ప్రదేశ్‌లో మరో రెండు కొత్త పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుపై చర్చించనున్నారు. పట్టణాభివృద్ధి సంస్థల పునర్వ్యవస్థీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. అన్నదాత సుఖీభవ పథకం విధి విధానాలపై చర్చ జరగనుంది. కేబినెట్ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Latest News
Raj SI recruitment exam 2021 to be reconducted, only 3.83 lakh original candidates eligible Fri, May 08, 2026, 03:58 PM
Raj CM fulfils Jajod schoolgirls' demand overnight, Science stream approved after 'Ratri Chaupal' Fri, May 08, 2026, 03:52 PM
Delhi L-G TS Sandhu vows to clean Yamuna; promote culture, growth Fri, May 08, 2026, 03:52 PM
Centre forms expert panel to protect litchi crop in Bihar Fri, May 08, 2026, 03:46 PM
Pakistan's internal policy failures fuelling Balochistan insurgency Fri, May 08, 2026, 03:34 PM