పిల్లల కోసం హెచ్‌డీ‌ఎఫ్‌సీ సూపర్ స్కీమ్.. 5 లక్షలకు రూ.13 లక్షలు
 

by Suryaa Desk | Mon, Jun 23, 2025, 11:46 PM

భవిష్యత్తు కోసం పొదుపు, పెట్టుబడులు చాలా అవసరం. ప్రధానంగా ఇంటి నిర్మాణం, రిటైర్మెంట్, పిల్లల చదువుల వంటి ఆర్థిక లక్ష్యాల కోసం పెద్ద మొత్తంలో నగదు అవసరమవుతుంది. ఆయా అవసరాలకు తగినంత రాబడులు అందించే పథకాలు ఎంచుకోవాలి. అందుకు మ్యూచువల్ ఫండ్స్ సరైన మార్గంగా చెప్పవచ్చు. అలాంటి పథకాలు ప్రస్తుతం చాలానే అందుబాటులో ఉన్నాయి. ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ఈ మ్యూచువల్ ఫండ్స్ సహాయపడతాయి. దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో నగదు చేతికి వచ్చేలా చేయవచ్చు. మీరు మీ పిల్లల చదువులు, భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చిల్డ్రన్ ఫండ్స్ సరైన ఎంపికగా చెప్పవచ్చు.


ప్రస్తుతం నెట్ అసెట్ వాల్యూ రూ.23 వేల కోట్లు, ఆపైన ఉన్న 12 రకాల చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ, వాటిల్లో కొన్ని మాత్రమే అధిక రాబడులు అందించాయి. వాటిల్లో టాప్ పర్ఫార్మింగ్ ఫండ్స్ ఐదు ఉన్నాయి. గడిచిన 5 సంవత్సరాల్లో చూసుకుంటే 20 శాతానికిపైగా రాబడులు అందించాయి. అందులో ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ హెచ్‌డీహెచ్‌సీ మ్యూచువల్ ఫండ్  తీసుకొచ్చిన చిల్డ్రన్ ఫండ్ ఒకటి. ఈ స్కీమ్ గత ఐదేళ్లలో మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఇన్వెస్టర్ల పెట్టుబడిని రెండింతలు చేసింది. రూ.5 లక్షలు పెట్టిన వారికి రూ.10 లక్షలకుపైగా అందించింది.


 హెచ్‌డీఎఫ్‌సీ చిల్డ్రన్స్ ఫండ్  కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు  21.45 శాతం మేర ఉంది. అంటే ఏడాదికి 21.45 శాతం వార్షిక రాబడులు అందించింది. లప్‌సమ్ పెట్టుబడిపై ఈ రాబడులు ఇచ్చిందు. ఉదాహరణకు ఇందులో ఐదేళ్ల క్రితం రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు ఆ విలువ రూ. 2.50 లక్షల వరకు ఉంటుంది. ఇక ఇందులో ఐదేళ్ల క్రితం రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటే వారి యూనిట్ల విలువ రూ. 13 లక్షలకుపైగా అవుతుంది. అంటే మీ పెట్టుబడిపై 5 ఏళ్లలోనే రూ.8.29 లక్షల వరకు వడ్డీ వస్తుంది. ఇక్కడ చక్రవడ్డీ అనేది మ్యాజిక్ చేస్తుంది. వడ్డీపైన వడ్డీ జనరేట్ అవుతుంటుంది.


అయితే, మ్యూచువల్ ఫండ్స్‌లోనూ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ ఒడుదొడుకులకు చాలా ఫండ్స్ ప్రభావితమవుతుంటాయి. ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ముందుగానే ఫండ్స్ గురించి తెలుసుకోవాలి. నిపుణులు సలహా మేరకు పెట్టుబడులు పెట్టడం మంచిది. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. గతంలో వచ్చిన రిటర్న్స్ ముందు ముందు వస్తాయనే గ్యారెంటీ ఉండదు.


 

Latest News
Apple to invest Rs 100 crore in India's renewable energy infrastructure Thu, May 07, 2026, 11:50 AM
Zoho's Sridhar Vembu seeks President rule, fresh elections in Tamil Nadu Thu, May 07, 2026, 11:49 AM
AGP backs Himanta Biswa Sarma as Assam Chief Minister for another term Thu, May 07, 2026, 11:48 AM
Op Sindoor anniversary: MP BJP highlights counter-terror message, CM says it reflected India's firm resolve to protect its citizens Thu, May 07, 2026, 11:46 AM
Tension in Rajasthan's Alwar after mob attacks Govindgarh police station Thu, May 07, 2026, 11:45 AM