|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 11:37 PM
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండు సెంచరీలు స్కోరు చేశాడు. హెడింగ్లో టెస్టులో తొలి ఇన్నింగ్స్, రెండో ఇన్నింగ్స్‌లో శతక్కొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ తర్వాత సోమర్‌సాల్ట్ చేశాడు పంత్. అంతకుముందు ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే రిపీట్ చేశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్ సెంచరీ తర్వాత కూడా పంత్.. సోమర్‌సాల్ట్ చేస్తాడని అంతా భావించారు. కానీ అందరూ అనుకున్నట్లు చేస్తే పంత్ ఎందుకు అవుతాడు. అందుకే అతడు డిఫరెంట్ స్టైల్‌లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీంతో పంత్ ఎందుకు ఇలా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు? వీటి వెనక ఉన్న కథేంటి? అని వెతుకున్నారు.
డెలీ అలీ సెలబ్రేషన్
రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన తర్వాత పంత్.. గ్లవ్, హెల్మెట్ తీసి సోమర్‌సాల్ట్ చేసేందుకు రెడీ అయినట్లు కనిపించాడు. స్టేడియంలో ఉన్న భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం.. సోమర్‌సాల్ట్ చెయ్ పంత్ అని సైగలు చేశాడు. కానీ పంత్ మాత్రం అలా చేయలేదు. అతడు చూపుడు వేలు, బొటన వేలిని కలిపి సున్నాలా చూసి అందులోంచి చూశాడు. దీనిని ‘డెలీ అలీ సెలబ్రేషన్’ అంటారు.
ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ డెలీ అలీ తొలిసారి ఈ తరహా సెలబ్రేషన్స్ చేశాడు. అందుకే దీనికి ‘డెలీ అలీ సెలబ్రేషన్’ అని పేరు వచ్చింది. 2018లో అతు ఇలాంటి సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఈ తరహా సెలబ్రేషన్స్‌కు ‘ఓకే’ అని అర్థమట. అప్పట్లో ‘డెలీ అలీ సెలబ్రేషన్’ సెన్షేషన్ అయింది. చాలా మంది సోషల్ మీడియా యూజర్లు.. వేలిని మడిచి కళ్ల ముందు పెట్టుకుని చూస్తూ ఫొటోలు, వీడియోలు పోస్టు చేశారు. ఆ తర్వాత ఇది పెద్దగా కనిపించలేదు.కానీ కనుమరుగవుతున్న ఈ ట్రెండ్‌ను రిషభ్ పంత్ మరోసారి గుర్తుకు తెచ్చాడు. పంత్ పుణ్యమా అని ‘డెలీ అలీ సెలబ్రేషన్’ మరోసారి నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సెలబ్రేషన్స్‌పై పంత్ స్పందించిన తర్వాత పూర్తి క్లారిటీ రానుంది!