రాజ్యసభ ఎంపీగా అరవింద్ కేజ్రీవాల్..,, క్లారిటీ!
 

by Suryaa Desk | Mon, Jun 23, 2025, 07:43 PM

ఈ ఏడాది మొదట్లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అంతకుముందు 10 ఏళ్లు అధికారంలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ .. ఘోర పరాభవాన్ని ఎదురుచూసింది. ఆప్ నేషనల్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా పలువురు అగ్రనేతలు ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలోనే 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గడ్డపై బీజేపీ జెండా ఎగిరింది. ఈ క్రమంలోనే ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. రాజ్యసభ లో అడుగు పెట్టనున్నారనే ఊహాగానాలు గత కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా పంజాబ్‌ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఆప్ ఎంపీ సంజీవ్ ఆరోరా విజయం సాధించడంతో.. ఆప్ రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. అయితే ఆ స్థానంలో అరవింద్ కేజ్రీవాల్.. రాజ్యసభ ఎంపీగా ఎన్నికవుతారని అంతా చర్చించుకుంటుండగా.. దీనిపై ఆయన తాజాగా ఒక క్లారిటీ ఇచ్చారు. తాను రాజ్యసభకు వెళ్లనున్నట్లు వస్తున్న ప్రచారాన్ని అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు.


తాను రాజ్యసభకు వెళ్లడం లేదని అరవింద్ కేజ్రీవాల్ తేల్చి చెప్పేశారు. పంజాబ్‌ లుథియానా పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. ఇందులో ఆప్‌ తరఫున బరిలోకి దిగిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజీవ్‌ అరోరా ఘన విజయం దక్కించుకున్నారు. దీంతో ఆయన త్వరలోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ స్థానం ఖాళీ అయితే.. కేజ్రీవాల్‌ రాజ్యసభకు ఎన్నిక కానున్నారంటూ పలు పార్టీలు ఆరోపణలు చేస్తుండగా.. దానిపై అరవింద్ కేజ్రీవాల్‌ వివరణ ఇచ్చారు. అయితే సంజీవ్ అరోరా రాజీనామాతో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానం నుంచి ఎవరు బరిలోకి దిగాలి అనేదానిపై ఆప్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.


 మరోవైపు, తాజాగా దేశంలోని పలు రాష్ట్రాల్లో నిర్వహించిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని విశావదర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన బై పోల్స్‌లో ఆప్‌ అభ్యర్థి గెలిచారు. ఈ గెలుపుపై తీవ్ర సంతోషం వ్యక్తం చేసిన కేజ్రీవాల్‌.. బీజేపీ పాలనతో గుజరాత్‌ ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గుజరాత్ ప్రజలు ఇప్పుడు ఆప్‌వైపు చూస్తున్నారని తెలిపారు. గుజరాత్‌లో ఆప్‌ను ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు.. పంజాబ్‌, గుజరాత్‌ ఎన్నికల్లో పోటీ చేస్తే.. అక్కడి ప్రజలు వారిని ఓడించారని వెల్లడించారు. గుజరాత్‌లో ప్రధాన పోటీ.. బీజేపీ, ఆప్‌ మధ్యనే ఉందని.. కాంగ్రెస్‌ పార్టీ బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM