రెడ్ బుక్ రాజ్యాంగం ఆపకపోతే తగిన మూల్యం తప్పదు
 

by Suryaa Desk | Mon, Jun 23, 2025, 06:27 PM

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న ఆద‌ర‌ణ చూడ‌లేక కూట‌మి ప్ర‌భుత్వం కుట్ర చేస్తుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిప‌డ్డారు.  జగనన్న ఎక్కడకు వెళ్లినా సముద్రంలా జనప్రవాహం వస్తోందన్నారు.  సోమ‌వారం ఆమె ఓ వీడియో విడుద‌ల చేశారు. రోజా ఏమ‌న్నారంటే..`జగన‌న్నను చూసి సముద్రం లా జనప్రవాహం వస్తోంది,  ఈవీఎం లు నుంచి ప్రభుత్వం అని ఇప్పటికే ప్రజల్లో చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలుకు దిగుతున్నారు, కేసులు పెడుతున్నారు. జూన్ 18 న జగనన్న కాన్వాయ్ ముందు చనిపోయారు అంటూ ఎస్పీ  చెప్పారు, జూన్ 22 తేదీ నాటికి ఎస్పీ చేత అబద్ధం చెప్పించారు. కల్తీ నెయ్యి ఘటనలో ఈవో ముందు నిజాలు మాట్లాడిన తర్వాత మాట్లాడించారు, ఆ తర్వాత వారం రోజుల్లో ఎలా  వెంటనే మాట మార్చారు అనేది ప్రజలు గమనించారు.  ఒకవేళ నిజమే ఐతే, డ్రైవర్ పై కేసు పెడతారా.. ? జగన‌న్నపై ఎలా కేసు పెడతారు. ఏడాది గా జరుగుతున్న ఘటనలపై కూడా కేసులు పెట్టాలి. ఫ్లైట్ కుప్ప కూలిన ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ పై ఎందుకు కేసు పెట్టలేదు. సింహాచలం గోడ ఘటనలో అద్భుతమైన ఏర్పాట్లు చేశామ‌ని హోం మంత్రి అన్నారు,  గోడ కూలిన భక్తులు చనిపోయిన ఘటనపై హోం మంత్రిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు. గేమ్ ఛేంజ‌ర్  సినిమా ఈవెంట్ లో బైక్ స్టంట్ లు చేయాలని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు విని ఇద్దరు చనిపోయారు.. దీనిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు. ఏడాది పాలనలో మీ ప్రభుత్వంలో మీటింగ్ లకు రావడం లేదు. జ‌గ‌న‌న్న మీటింగుల‌కు పొలాల్లోంచి పరుగులు పెడుతున్నారు. మీరు విడుదల చేసిన క్లిప్ లో ముందు, వెనుక వీడియో విడుదల చేయాలి. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి కు మానవత్వం లేదు అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కోవిడ్ సమయంలో ప్రజలు ఎలా ప్రాణాలు కాపాడారో ఈ రాష్ట్ర ప్రజలు అందరికి తెలుసు. మానవత్వం లేని వాళ్లు మీరు, మీ కుమారుడు, అబద్ధాలతో ఓట్లు వేయించుకున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఆపకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు` అని మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చ‌రించారు.

Latest News
Sringeri recount row: Congress alleges postal ballot tampering, vows legal fight Tue, May 05, 2026, 03:35 PM
Vietnam Prez To Lam offers prayers at Mahabodhi Temple in Bodh Gaya Tue, May 05, 2026, 03:24 PM
India, Canada kick off second round of free trade talks Tue, May 05, 2026, 03:23 PM
India, Japan commit to stronger healthcare systems, resilient supply chains Tue, May 05, 2026, 03:21 PM
'Tamil Nadu, Kerala results show strength of Indian democracy' Tue, May 05, 2026, 03:06 PM