|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 06:09 PM
రాష్ట్రంలో రాజకీయ అండదండలతో చెలరేగిపోతున్న రౌడీలు, సంఘ విద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని కట్టడి చేసేందుకు ఉత్తరప్రదేశ్ తరహాలో కఠిన చర్యలు తీసుకునే అంశంపై ప్రభుత్వ పెద్దల స్థాయిలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అయితే, యూపీలో అమలు చేస్తున్న వివాదాస్పద బుల్డోజర్ పాలన, ఎన్‌కౌంటర్లు కాకుండా నేర ప్రవృత్తిని అరికట్టే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
Latest News