|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 06:07 PM
ఇరాన్‌లోని కీలక అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ అణ్వాయుధాలు సంపాదించకుండా నిరోధించేందుకే ఈ దాడులు చేశామని అమెరికా పేర్కొంది. అయితే, ఇరాన్ కు నేరుగా తమ అణ్వాయుధాలను అందించేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయని రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ పేర్కొన్నారు. అమెరికా వైమానిక దాడులపై మెద్వెదేవ్ టెలిగ్రామ్ వేదికగా స్పందించారు. ఇరాన్ అణుకేంద్రాలపై జరిపిన దాడులతో అమెరికా పెద్దగా సాధించిందేమీ లేదని, అణుకేంద్రాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ దాడుల ద్వారా మధ్యప్రాచ్యంలో మరో కొత్త యుద్ధానికి అమెరికా తెరలేపిందని ఆయన మండిపడ్డారు. ఆయా ప్రాంతాల్లో "అణు పదార్థాల శుద్ధి, భవిష్యత్తులో అణ్వాయుధాల తయారీ కొనసాగుతుంది" అని మెద్వెదేవ్ అభిప్రాయపడ్డారు. ఈ దాడుల వల్ల ఇరాన్‌లో రాజకీయ పాలన మరింత బలపడిందని ఆయన విశ్లేషించారు.
Latest News