|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 05:43 PM
నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది. గుజరాత్‌లోని విసావదర్, కడి స్థానాలతో పాటు పంజాబ్‌లోని లూథియానా వెస్ట్, పశ్చిమ బెంగాల్‌లోని కాళీగంజ్, కేరళలోని నీలాంబూరు నియోజకవర్గాలకు జూన్ 19న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. వెలువడుతున్న తొలి ఫలితాల సరళి ప్రకారం కేరళలోని నీలాంబూరు స్థానంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) అభ్యర్థి ఆర్యదన్ షౌకత్ ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి మోహన్ జార్జ్, సీపీఎం అభ్యర్థి ఎం. స్వరాజ్ వెనుకంజలో ఉన్నారు. విసావదర్, లుధియానాలో ఆప్ అభ్యర్థులు ముందంజలో ఉండగా, కాళీగంజ్‌లో టీఎంసీ అభ్యర్థి లీడ్‌లో ఉన్నారు. ఈ ఉప ఎన్నికలను అధికార ఎన్డీయే కూటమితో పాటు విపక్ష ఇండియా కూటమి కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఉప ఎన్నికలు ఒకరకంగా దిక్సూచిగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Latest News