|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 05:31 PM
కడప నగరంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కార్పొరేటర్ ఒకరు ప్రభుత్వ స్థలాన్ని యథేచ్ఛగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని ఆమె ఆరోపించారు. వారం రోజుల్లోగా ఆక్రమణలు తొలగించకపోతే బుల్డోజర్‌తో కూల్చివేస్తామని, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయిస్తామని గట్టిగా హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, కడప నగరంలోని నాలుగో డివిజన్ పరిధిలో, మెయిన్ రోడ్డుకు లోపల వైపున ఉన్న ప్రభుత్వ రోడ్డు, పేవ్‌మెంట్‌ను ఆక్రమించుకుని 34వ డివిజన్ కార్పొరేటర్ అక్బర్ అక్రమంగా గదులు నిర్మించుకున్నారని ఎమ్మెల్యే మాధవి రెడ్డి తెలిపారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ, ప్రజా ప్రతినిధిగా ఉండి ఇలా ప్రభుత్వ స్థలాలనే కబ్జా చేయడం దారుణమని ఆమె మండిపడ్డారు. "ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. కార్పొరేటర్ మనుషులే ఇక్కడ పనులు చేస్తున్నారు. వారం రోజుల్లోగా కార్పొరేటర్ ఈ నిర్మాణాలను స్వయంగా తొలగించాలి. లేకపోతే బుల్డోజర్ తీసుకువచ్చి మేమే కూల్చివేస్తాం. అక్బర్‌పై కచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం" అని ఎమ్మెల్యే మాధవి రెడ్డి స్పష్టం చేశారు.
Latest News