|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 05:31 PM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శిలా తోరణం వరకు క్యూ లైన్లు ఉన్నాయి. దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కాగా, భక్తుల సేవల్లో సాంకేతికత వినియోగానికి టీటీడీ ప్రాధాన్యత ఇస్తోంది. కొత్త మార్పుల దిశ గా కసరత్తు జరుగుతోంది. అటు అలిపిరి ఆర్చిని కొత్తగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇక.. తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు.. పంపిణీ విధంగా కొత్త విధానం అమల్లోకి వచ్చింది. తాజా నిర్ణయంతో తిరుమలలో సాంకేతికత ద్వారా భక్తులకు సేవలను సులభతరం చేసేందుకు టీటీడీ వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. టీటీడీలో కియోస్క్ (సెల్ఫ్ ఆపరేటెడ్ మిషన్) యంత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో 20 కియోస్క్‌ల ఏర్పాటు చేసారు. కియోస్క్‌ల సాయం తో భక్తులకు టీటీడీ సేవలు సులభంగా అందుతున్నాయి. పైగా బోలెడంత సమయం ఆదా అవుతోంది. దీంతో ఈ కియోస్క్‌లను విరివిగా వినియోగించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు హుండీ ద్వారా కాకుండా విరాళాలు ఇవ్వాలంటే పెద్ద తతంగమే ఉండేది. రూ.లక్షకుపైగా విరాళాలు ఇవ్వాలంటే దాతల విభాగానికి చేరుకుని, అక్కడ అన్ని వివరాలూ తెలియజేసిన తర్వాతే విరాళాలు తీసుకునేవారు. కియోస్కీ ద్వారా ఇక, తాజాగా తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్‌లో టీటీడీ కియోస్క్ మిషన్లను ఏర్పాటు చేసింది. భక్తులు సులభంగా విరాళాలు అందజేసేలా టీటీడీ తొలుత ఈ కియోస్క్ మిషన్లను అందుబాటు లోకి తీసుకురాగా, తాజాగా లడ్డూలకూ విస్తరించి, ఐదు కియోస్క్‌లను అందుబాటులోకి తీసుకొ చ్చింది. దర్శన టికెట్లు, టోకెన్లపై ఉండే నెంబరును భక్తులు ఈ కియోస్క్‌లో నమోదు చేసి లడ్డూల సంఖ్యను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా భక్తులు 10 నుంచి 15 లడ్డూల వరకు పొందవచ్చు. ఆ తర్వాత కనిపించే కోడ్‌ను భక్తులు తమ మొబైల్ ద్వారా స్కాన్ చేసి పేమెంట్ చేస్తే ఓ రసీదు వస్తుంది. దాంతో నేరుగా కౌంటర్ వద్దకు వెళ్లి లడ్డూలు పొందవచ్చు. ఎలాంటి దర్శన టోకెన్లు, టికెట్లు లేని భక్తులైతే తమ ఆధార్ నెంబరును నమోదు చేసి రెండు లడ్డూలు పొందవచ్చు. టీటీడీ ప్రణాళికలు లడ్డూల నిల్వ, రద్దీని బట్టి ఈ సంఖ్య మారుతుంటుంది. కొద్ది రోజులు ఈ విధానాన్ని కొనసాగించి లోటుపాట్లను సరిచేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రూ.లక్షలోపు విరాళాలిచ్చే భక్తులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో తొలిసారిగా వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఈ కియోస్క్ మిషన్‌ను ఏర్పాటు చేశారు. భక్తులు దీనిలోని క్యూఆర్ కోడ్‌ను తమ సెల్‌ఫోన్‌తో స్కాన్ చేసి యూపీఐ ద్వారా రూ.లక్షలోపు ఎంతైనా విరాళంగా అందించవచ్చు. ఇది మంచి ఫలితాలను ఇవ్వడంతో టీటీడీ ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో 20 కియోస్క్ లు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఇప్పటివరకు రూ.4 కోట్ల విరాళాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మరికొన్ని సేవల్లోకి కియోస్క్ లను ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు లడ్డూ ప్రసాదం కోసం వీటి సేవలను వినియోగిస్తున్నరు. భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ కు అనుగుణంగా విస్తరణ పైన నిర్ణయం తీసుకోనున్నారు.
Latest News