|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 04:38 PM
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి ఈ నెల 12వ తేదీతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా అమరావతి రాజధానిలో నేడు బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి ఈ బహిరంగ సభను 12వ తేదీన నిర్వహించాలని తొలుత భావించినప్పటికీ, గుజరాత్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం కారణంగా నేటికి వాయిదా వేశారు.సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర సచివాలయం వెనుక భాగంలో వేదికను ఏర్పాటు చేశారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధిని తెలియజేయడంతో పాటు రాబోయే నాలుగేళ్లలో అమలు చేయనున్న పథకాలు, అభివృద్ధి గురించి వివరించనున్నారు.
Latest News