|
|
by Suryaa Desk | Sun, Jun 22, 2025, 11:21 PM
ఈక్విటీ పెట్టుబడిదారులకు అలర్ట్. ఈ వారం మ్యూచువల్ ఫండ్స్ మరో 7 కొత్త ఫండ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణం, ఇన్వెస్టర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలంలో హైరిటర్న్స్ అందించే లక్ష్యంతో ఈ న్యూ ఫండ్ ఆఫర్స్ తీసుకొస్తున్నాయి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు. మొత్తం 7 కొత్త పథకాలు వస్తుండగా జూన్ 23 నుంచి సబ్‌స్క్రిప్షన్ మొదలవుతోంది. జూన్ 27వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. వీటిల్లో రెండు ఇండెక్స్ ఫండ్స్, ఒక స్మాల్ ఫండ్, ఒక లో డురేషన్ ఫండ్, థెమాటిక్ ఫండ్, ఈటీఎఫ్ ఫండ్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ వంటివి ఉన్నాయి. ఆయా స్కీమ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఎస్‌బీఐ నుంచి కొత్త స్కీమ్..
దిగ్గజ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి ఎస్‌బీఐ నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్ తీసుకొచ్చింది. దీంతో పాటు కోటక్ నిఫ్టీ 200 క్వాలిటీ 30 ఇండెక్స్ ఫండ్ వస్తోంది. ఈ రెండు పథకాల సబ్‌స్క్రిప్షన్ జూన్ 23 (సోమవారం) రోజున మొదలవుతోంది. ఎస్‌బీఐ స్కీమ్ జులై 3న ముగియగా, కోటక్ ఫండ్ జులై 7 వరకు అందుబాటులో ఉంటుంది. ఎస్‌బీఐ కనీస పెట్టుబడి రూ.5 వేలుగా ఉండగా, కోటక్ నిఫ్టీ ఫండ్‌లో రూ.100గా ఉంది.
బజాబ్ ఫిన్‌సర్వ్ స్మాల్ క్యాప్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ జూన్ 27వ తేదీన మొదలై జులై 11వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.500గా ఉంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ ఇన్నోవేషన్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ జూన్ 27న మొదలై జులై 11వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. వీటిల్లో కనీస పెట్టుబడి రూ.100గా ఉంది. అలాగే యూనియన్ లో డ్యూరేషన్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ జూన్ 26వ తేదీన మొదలై జులై 3 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.1000గా ఉంది.
కోటక్ నిఫ్టీ 200 క్వాలిటీ 30 ఈటీఎఫ్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ జూన్ 23వ తేదీన ప్రారంభమై జులై 7వ తేదీన ముగుస్తుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.5 వేలుగా ఉంది. జెరోధా సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ జూన్ 23వ తేదీన మొదలవుతుంది. జులై 4వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.500గా ఉంది.
Latest News