|
|
by Suryaa Desk | Sun, Jun 22, 2025, 11:20 PM
ప్రస్తుతం పెట్టుబడి పెట్టేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే, చాలా మంది, ముఖ్యంగా యువత మ్యూచువల్ ఫండ్స్ వైపు వస్తున్నారు. ప్రతి నెల కోట్లాది రూపాయలు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అసెట్ మేనేజ్మెంట్ సంస్థలు సైతం మార్కెట్ పరిస్థితులు, ఇన్వెస్టర్ల అవసరాలకు తగినట్లుగా కొత్త కొత్త ఫండ్స్ తీసుకొస్తున్నాయి. ఇప్పుడు ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ సరికొత్త ఫండ్ లాంచ్ చేస్తోంది. మరి ఈ స్కీమ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి ఎస్‌బీఐ నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్ పేరుతో కొత్త ఫండ్ తీసుకొస్తోంది. ఇది ఈక్విటీ న్యూ ఫండ్ ఆఫర్. ఇన్వెస్టర్లు ఈ ఫండ్ కోసం జూన్ 23వ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఈ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ జూన్ 23, 2025 రోజున ప్రారంభమై జులై 3, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ స్కీమ్ వెరీ హై రిస్క్ ఉంటుందని సెబీ పేర్కొంది.
కనీస పెట్టుబడి రూ.5 వేలు..
ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ తీసుకొస్తున్న నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్‌లో చేరేందుకు కనీస పెట్టుబడి రూ.5 వేలుగా నిర్ణయించారు. ఆ తర్వాత ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. అంటే రూ.5 వేలు పెట్టు సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ స్కీన్ NAV ధర రూ.10గా ఉంది. సబ్‌స్క్రిప్షన్ పూర్తయిన తర్వాత జులై 10, 2025 రోజున యూనిట్లు కేటాయిస్తారు. ఎగ్జిట్ లోడ్ 0.2 శాతంగా ఉంది. ఈ స్కీమ్ బెంచ్ మార్క్ ఉండెక్స్ నిఫ్టీ 200 మూమెంటమ్ 30 టీఆర్ గా ఉంది.
ఈ కథనం కేవలం సమాచారం కోసమే. ఎలాంటి పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహించడం లేదు. మ్యూచువల్ ఫండ్స్‌లోనూ హైరిస్క్ ఉంటుంది. తమ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యం వంటి విషయాల ఆధారంగా పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలి. నిపుణుల సలహాలు తీసుకుని సరైన ఫండ్ ఎంచుకున్నప్పుడే మంచి రిటర్న్స్ అందుకునే అవకాశం ఉంటుంది. లేదంటే మొత్తం కోల్పోవచ్చు. ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు తాము ఎంచుకునే ఫండ్ గురించి ముందే తెలుసుకోవడం మంచిది. ప్రస్తుతం చాలా రకాల ఫండ్స్ హైరిటర్న్స్ ఇస్తున్నాయి. అలాగే కొత్తగా ఎంట్రీ ఇచ్చే వారు న్యూ ఫండ్ ఆఫర్స్‌కి దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.