సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు
 

by Suryaa Desk | Sun, Jun 22, 2025, 07:39 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి షాక్ తగిలింది. సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఏపీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. అమరావతి రాజధాని మహిళలపై సజ్జల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కంభంపాటి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే సజ్జలపై క్రిమినల్ కేసు నమోదైంది.


మరోవైపు ఓ ఛానెల్ డిబేట్‌లో జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతిపైనా, అమరావతి మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో అమరావతి ప్రాంత వాసులు, మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. జర్నలిస్టు కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అలాగే జర్నలిస్టు కృష్ణంరాజుపైనా, డిబేట్ నిర్వహించిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కొమ్మినేని శ్రీనివాసరావును, జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వటంతో కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదల అయ్యారు.


అయితే జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలపై స్పందించే క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అమరావతి మహిళలు మరోసారి భగ్గుమన్నారు. అలాగే ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా స్పందించారు. రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు.


సజ్జల కులవివక్షకు సంబంధించిన పదం వాడారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డీజీపీకి రాసిన లేఖలో రఘురామకృష్ణరాజు కోరారు. ఈ క్రమంలోనే ఏపీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష కూడా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తాడేపల్లి పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. విచారణకు రావాలంటూ త్వరలోనే నోటీసులు కూడా ఇస్తారని తెలుస్తోంది.

Latest News
Gujarat local poll results: BJP takes early lead across civic, rural bodies Tue, Apr 28, 2026, 12:01 PM
Australian minister urges enhanced protection for Great Barrier Reef Tue, Apr 28, 2026, 11:57 AM
Trump not satisfied with Iran's new peace proposal Tue, Apr 28, 2026, 11:55 AM
It was a bad luck, we've to forget this day and move on: Axar Tue, Apr 28, 2026, 11:00 AM
Bengaluru continues to lead as career hub for large companies in AI era Tue, Apr 28, 2026, 10:46 AM