ఏపీ,తెలంగాణలో వర్షాలు..
 

by Suryaa Desk | Sun, Jun 22, 2025, 04:26 PM

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. కొన్ని చోట్ల వర్షాలు కురుస్తుంటే.. మరోవైపు సూర్యుడు సైతం సెగలు కక్కలు కక్కుతున్నాడు.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.. రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలో పశ్చిమ, నైరుతి దిక్కుల గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో వచ్చే రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. ఆదివారం తెలంగాణ లోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు: ఈ రోజు తెలంగాణలోని ఖమ్మంలో గరిష్టంగా 38, మహబూబ్ నగర్‌లో కనిష్టంగా 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆంధ్రా వెదర్ రిపోర్ట్.. ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరిలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూగో, పగో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Latest News
Man arrested for killing elderly sister, dumping body in drain in Mumbai Mon, Apr 27, 2026, 01:35 PM
Four of family die in suspected food poisoning case in Mumbai Mon, Apr 27, 2026, 01:19 PM
Major security sabotage at Chinnaswamy during RCB-GT match; 2 held for sabotaging 240 CCTV cameras Mon, Apr 27, 2026, 12:51 PM
India organises Vishu, Easter and Eid al-Fitr jointly in Azerbaijan Mon, Apr 27, 2026, 12:49 PM
PM Modi shares aerial photo of jam-packed rally venue in Bengal's Barrackpore Mon, Apr 27, 2026, 12:29 PM