|
|
by Suryaa Desk | Sun, Jun 22, 2025, 04:26 PM
ఒప్పో మరోసారి భారత మార్కెట్‌లో సరికొత్త ఒప్పో A5 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసి వినియోగారులను ఆకర్షిస్తోంది. బడ్జెట్ ధరలో అత్యాధునిక ఫీచర్లతో రూపొందించిన ఈ మొబైల్ 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో వస్తుంది, ఇందులో 120Hz రీఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిళ్ళా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో పాటు IP65 రేటింగ్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉన్నాయి. ఈ ఫోన్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో శక్తివంతమైన పనితీరును అందిస్తుంది, 6GB/8GB RAM, 128GB వర్చువల్ RAM, 1TB వరకు విస్తరించగల స్టోరేజ్‌తో ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15పై నడుస్తుంది.
కెమెరా విషయానికొస్తే, ఒప్పో A5 5G 50MP ప్రధాన కెమెరా, 2MP మోనోక్రోమ్ సెన్సర్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌లో 6000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండగా, 37 నిమిషాల్లో సగం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఈ బ్యాటరీ 5 సంవత్సరాల పాటు మెరుగైన పనితీరును అందిస్తుందని కంపెనీ తెలిపింది. డ్యూయల్ సిమ్, 5G, బ్లూటూత్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ ఆకర్షణీయంగా ఉంది.
ఒప్పో A5 5G అరోరా గ్రీన్, మిస్ట్ వైట్ రంగులలో లభిస్తుంది. దీని 6GB+128GB వేరియంట్ ధర రూ. 15,499 కాగా, 8GB+128GB వేరియంట్ ధర రూ. 16,999గా నిర్ణయించారు. ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ఇతర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఈ మొబైల్ అందుబాటులో ఉంది. ధరకు తగ్గట్టుగా ఆకట్టుకునే ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ వినియోగదారులకు గొప్ప ఎంపికగా నిలుస్తుంది.
Latest News