అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 80 డాక్టర్లను కాపాడిన ఫ్యామిలీ
 

by Suryaa Desk | Sat, Jun 21, 2025, 10:05 PM

అహ్మదాబాద్ విమాన ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. విమానం కూలిన బీజే మెడికల్ కాలేజీలోని డాక్టర్లకు భోజనం సరఫరా చేసే రవి ఠాకూర్ కుటుంబం.. ఆ రోజు 80 మంది డాక్టర్ల ప్రాణాలను రక్షించింది. కానీ విధి వక్రీకరించి.. ఈ విమాన ప్రమాదంలో రవి ఠాకూర్ తన కూతురు, తల్లిని కోల్పోయాడు. ఆ రోజు ఆస్పత్రి నుంచి తన కూతుర్ని తీసుకెళ్లకపోవడంతో ఆమె ప్రాణాలు పోయాయి. ఈ విమానం కూలిన దుర్ఘటన ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది.


అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 80 డాక్టర్లను కాపాడిన ఫ్యామిలీ.. కానీ తల్లీ, కుమార్తె దుర్మరణం


అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. 241 మంది ప్రయాణికులతో పాటు 34 మంది వరకు డాక్టర్లు ఈ ప్రమాదంలో మరణించారు. ఈ మెుత్తం ప్రమాదంలో ఒకే ఒక్కరు విశ్వాస్ కుమార్‌ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, అందరికి తెలియని విషయం ఏంటంటే.. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి కుటుంబం దాదాపు 80 మంది డాక్టర్లను కాపాడింది. అవును.. మీరు విన్నది నిజమే. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమాన ప్రమాదం జరిగిన మేఘాని నగర్‌లో రవి ఠాకూర్ కుటుంబం నివాసం ఉంటుంది. వీరి ఫ్యామిలీ గత 15 సంవత్సరాలుగా బీజే మెడికల్ క్యాంపస్‌లోని డాక్టర్లకు మధ్యాహ్నం ఫుడ్ సఫ్లై చేస్తోంది.


అయితే ఆరోజు కూడా అంటే ప్రమాదం జరిగిన జూన్ 12వ తేదీన మధ్యాహ్నం చాలా మంది డాక్టర్లు బీజే మెడికల్ కాలేజీ మెస్‌లో తినడానికి వచ్చారు. సరిగ్గా అదే సమయంలో విమానం కూలి దాదాపు 34మందికిపైగా డాక్టర్లు మరణించారు. కానీ, చాలా మంది డాక్టర్లు ఇంకా భోజనంకు రాలేదు. దానికి కారణం.. రవి ఠాకూర్ అతడి భార్య స్వయంగా భోజనాన్ని వార్డుల్లోకి తీసుకెళ్లి అందించారు. రవి, అతని భార్య లలిత, తండ్రి ప్రహ్లాద్ ఠాకూర్, వారి బంధువు సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు వార్డులలోని డాక్టర్లకు టిఫిన్ క్యారియర్‌లను అందించడానికి బయలుదేరారు. లేదంటే ఆ రోజు దాదాపు 80 మంది డాక్టర్లు తినడానికి మెస్‌లోకి వచ్చేవారు. వారు రాకపోవడంతో ఈ భారీ ప్రమాదం నుంచి దాదాపు 80 మందికిపైగా బయటపడ్డారని చెబుతున్నారు.


చాలా మంది డాక్టర్లు రవి ఠాకూర్ భోజనం తీసుకెళ్లడంతో మెస్‌కు వెళ్లకుండా ఉండిపోయారు. కొంతమంది హాస్టళ్లలో మరికొంతమంది వార్డుల్లో పెషెంట్లను చూస్తూ ఉండిపోయారు. అయితే, 80 మందిని కాపాడిన రవి.. విధి ఆడిన వింత నాటకంలో మాత్రం.. తన రెండేళ్ల కూతురు ఆధ్యతో పాటు తన తల్లి ప్రాణాలను కోల్పోయాడు. పాపం ఆ చిన్నారి నాన్నతో వెళ్తానని చెప్పింది. కానీ, బయట ఎండగా ఉందని నువ్వు నాన్నమ్మతో ఆడుకోమ్మని చెప్పి వెళ్లిపోయారు. దీంతో ఆమెను మెస్‌లో వంట చేస్తున్న తన తల్లి సర్లా ఠాకూర్ వద్ద వదిలి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆధ్య చాలా ఏడ్చిందని రవి ఠాకూర్ చెబుతున్నాడు. తనతో ఆ రోజు తీసుకెళ్లి ఉంటే కనీసం తన కూతురు అయినా బతికి ఉండేదని అతడు కన్నీరు మున్నీరవుతున్నాడు.


రోజు మెస్‌లో టిఫిన్‌లను నింపడం, ఆహారాన్ని అందించడం, పాత్రలను కడగడం, తిరిగి మరుసటి రోజుకు ఆహారం సిద్ధం చేయడం.. ఇలా నిత్యం ఎంతో బిజీగా ఉంటామని రవి ఠాకూర్ చెబుతున్నాడు. ఆ రోజు కూడా అంతే పనిలో ఉన్నామని.. అందుకే పాపను, తన తల్లి దగ్గర విడిచి వెళ్లామని రవి ఠాకూర్ చెబుతున్నాడు. కానీ, కొద్దిసేపటికే సుమారు ఒంటి గంట 40 నిమిషాలకు చెవులు పేలిపోయే భారీ శబ్దం ఒకటి మాకు వినిపించిందని ఆయన చెబుతున్నాడు. ఏం జరిగిందో వచ్చి చూసే లోపే భారీ మంటలు, నల్లటి పొగ మెుత్తం బిల్డింగ్‌ను చుట్టుముట్టాయి. కాసేపటికి తెరుకోని చూస్తే కూలింది ఒక విమానమని.. అది కూడా మెస్ భవనంపైనే కూలిందని తెలిసింది.


దీంతో తాము అక్కడికి పరిగెత్తామని.. కానీ పోలీసులు, అక్కడున్న కొంతమంది నన్ను ఆపారని రవి ఠాకూర్ చెబుతున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో కొంతమంది డాక్టర్లు తమకు అర్థమయ్యేలా చెప్పారని అన్నారు. ఆ తర్వాత డీఎన్ఏ నమూనాలను ఇవ్వమని పోలీసులు అడిగారు. అలా గురువారం ఉదయం తమ DNA లతో రెండు మృతదేహాలు సరిపోలాయి. దీంతో వారిద్దరూ ప్రమాదంలో మరణించారని పోలీసులు ధ్రువీకరించారు. ఆ తర్వాత వారి అంత్యక్రియలు నిర్వహించామని రవి ఠాకూర్ ఏడుస్తూ చెబుతున్నాడు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం కొన్ని వందల కుటుంబాల్లో ఇలాంటి విషాదాన్నే నింపింది. ఇవి బయటపడ్డ కొన్ని సంఘటనలు మాత్రమే.. ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి.

Latest News
'Once a judge always a judge', says CJI Surya Kant in Jaipur Sat, Apr 25, 2026, 02:13 PM
Hectic activity in Karnataka Congress: Shivakumar camps in Delhi; Siddaramaiah meets supporters Sat, Apr 25, 2026, 02:11 PM
US House panel clears 20 measures to curb China's chip ambitions: Report Sat, Apr 25, 2026, 01:13 PM
Power struggle in Baramati: Third generation of Pawar family fuels succession debate Sat, Apr 25, 2026, 01:10 PM
Cong will play decisive role in forming govt in Bengal after Assembly polls, says party MPs Sat, Apr 25, 2026, 01:04 PM