కోడలిని చంపి.. ఇంటి ముందు కప్పిపెట్టిన అత్తింటివారు
 

by Suryaa Desk | Sat, Jun 21, 2025, 10:04 PM

హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ జిల్లా సికోహాబాద్‌కు చెందిన టానుకు.. అరుణ్‌ సింగ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అరుణ్ స్థానికంగా గార్మెంట్స్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే అతడు ఏప్రిల్ 24న తన భార్య కనిపించకుండా పోయిందని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే అదే రోజు తన కోడలు తన బాయ్‌ఫ్రెండ్‌తో లేచిపోయిందని ఇరుగుపొరుగు వారితో చెప్పింది. అదే విషయాన్ని టాను తల్లిదండ్రులకు కూడా చెప్పింది.


అయితే రెండు నెలలు గడుస్తున్నా టాను ఆచూకీ తేలియరాలేదు. దీంతో ఆమె తండ్రి (జూన్ 19)న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురు హత్యుకు గురై ఉంటుందని ఆరోపించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే రోషన్ నగర్‌లో ఉన్న అరుణ్ సింగ్ ఇంటికి తాళం వేసి ఉండగా.. గురువారం రాత్రి అతడి ఇంటి ముందు తవ్వడం ప్రారంభించారు. శుక్రవారం (జూన్ 20) ఉదయం10 అడుగుల గొయ్యి నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు.


పక్కాగా స్కెచ్ వేసి..


అనంతరం పోలీసులు విచారణ చేపట్టగా.. సంచలన విషయాలు బయటపడ్డాయి. టానును ఏప్రిల్ 25న హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె మృతదేహాన్ని ఎలా దాచిపెట్టాలో టాను అత్తింటివారు పక్కాగా పథకం వేశారు. అందులో భాగంగా వారి ఇంటి గేటు బయట రోడ్డును తవ్వారు. నీళ్లు నిలిచిపోకుండా ఒక గుంత తవ్వుతున్నామని పొరుగువారికి చెప్పారు. ఆ రాత్రి టాను మృతదేహాన్ని 10 అడుగుల గొయ్యిలో పాతిపెట్టారు. అనంతరం ఇసుకతో ఆ గుంతను పూడ్చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. కూలీలను ఉపయోగించకుండా, జేసీబీ సహాయంతో ఆ గుంతను పూడ్చేశారు.


స్థానికంగా ఉండే ఒక మహిళ ఈ విషయం గురించి మాట్లాడింది. "ఏప్రిల్ 22న మా పొరుగు ఇంట్లో పెళ్లి జరిగింది. ఆ తర్వాత రోజు సాయంత్రం జేసీబీతో రోడ్డు తవ్వడం మొదలుపెట్టారు. ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ప్లాస్టిక్ షీట్లతో కప్పారు. కొన్ని రోజుల తర్వాత జేసీబీతో ఆ గుంతను పూడ్చేశారు" అని ఆమె చెప్పింది.


ఈ హరికేష్ తివారీ అనే మరో వ్యక్తి మాట్లాడుతూ మొదట్లో తనకు ఎలాంటి అనుమానం రాలేదని చెప్పాడు. "కుటుంబ సభ్యులు చాలా లోతుగా గుంత తీసి, అందులో మృతదేహాన్ని పాతిపెట్టారు. వెంటనే పూడ్చేశారు. ఎలాంటి వాసన రాకపోవడంతో ఎవరికీ అనుమానం రాలేదు. అన్నీ రాత్రికి రాత్రే చేశారు. మరుసటి ఉదయానికి రోడ్డు సాధారణంగా కనిపించింది" అని ఆయన అన్నాడు.


టాను తండ్రి గురువారం సాయంత్రం ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. తన కూతురిని హత్య చేసి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు వెంటనే తవ్వకాలు ప్రారంభించారు. ఆ సమయంలో నిందితుల ఇల్లు తాళం వేసి ఉంది. "శరీరం బాగా కుళ్లిపోయి ఉంది. ఎలాంటి గాయాలు కనిపించలేదు.


హత్యకు గల కారణం తెలుసుకోవడానికి పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నాం" అని పల్లా ఓ పోలీసు అధికారి సత్య ప్రకాష్ శుక్రవారం తెలిపారు. మృతదేహాన్ని బాద్షా ఖాన్ సివిల్ హాస్పిటల్ మార్చురీకి తరలించినట్లు SHO వెల్లడించారు. మృతదేహం బయటపడిన తర్వాత టాను భర్త, మామతో పాటు మరికొందరిపై హత్య కేసు నమోదు చేశారు. "నిందితులను త్వరలో అరెస్టు చేస్తాం" అని ప్రకాష్ శుక్రవారం చెప్పారు. ఈ కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని టాను కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Latest News
Drop Kohli on the first ball; he will definitely make you pay: Gavaskar Sat, Apr 25, 2026, 12:24 PM
US sanctions China refinery over Iran oil trade Sat, Apr 25, 2026, 12:18 PM
Anna Hazare defends MPs' exit from AAP; BJP leaders say shift reflects growing faith in party Sat, Apr 25, 2026, 12:13 PM
UN urges peaceful use of nuclear tech on 40th anniversary of Chernobyl disaster Sat, Apr 25, 2026, 12:09 PM
Google to invest up to $40 billion in Anthropic amid global AI race Sat, Apr 25, 2026, 12:01 PM