|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 03:20 PM
బాపట్ల జిల్లాలోని రేపల్లె మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెనుమూడిలో న్యాయవాది మృతదేహం లభ్యమైంది. కృష్ణా నది ఒడ్డున కొండపల్లి శ్రీనివాసరావు(50) మృతదేహం కనిపించడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆయన రేపల్లె కోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నారు. రెండు సార్లు రేపల్లె బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలిచారు. పోలీసులు ఇది హత్యా కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Latest News