|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 02:06 PM
AP: యోగాంధ్ర ద్వారా చరిత్ర సృష్టించామని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం విశాఖలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘యోగాంధ్ర కార్యక్రమానికి ప్రకృతి, వరుణ దేవుడు కరుణించాడు. యోగాంధ్రలో పాల్గొనేందుకు దాదాపు 3.3 లక్షల మంది వచ్చారు. తొలిసారి రెండు గిన్నిస్ రికార్డులు సృష్టించాం. యోగాంధ్ర కోసం రాష్ట్రవ్యాప్తంగా 2.45 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1.80 కోట్ల మందికి సర్టిఫికెట్ ఇవ్వాల్సి వస్తోంది.’ అని అన్నారు.
Latest News