|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 10:30 AM
తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లలో నిలబడినట్టు సమాచారం. నిన్న 76,181 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.4.88 కోట్లు ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Latest News