వీళ్లను అస్సలు నమ్మొద్దు..తిరుమల భక్తులకు హెచ్చరించిన టీటీడీ
 

by Suryaa Desk | Fri, Jun 20, 2025, 07:33 PM

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు నకిలీ టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ సీవీఎస్వో కెవి మురళీ కృష్ణ హెచ్చరించారు. గత మార్చిలో ఒక వైద్య విద్యార్థినిని మోసం చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. దళారుల గురించి ఫిర్యాదులు వస్తున్నాయని, వారిపై నిఘా పెట్టామని ఆయన చెప్పారు. భక్తులు దళారులను నమ్మి మోసపోవద్దని, టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు.


తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మురళీ కృష్ణ. ఎవరైనా నకిలీ టికెట్లు అమ్మి మోసం చేస్తే వారిని వదిలిపెట్టమన్నారు. గత మార్చి నెలలో విజయవాడకు చెందిన ఒక వైద్య విద్యార్థినిని కొందరు మోసం చేశారని.. మదన్ దీప్ బాబు అలియాస్ సందీప్, పవన్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు ఆమెకు సుప్రభాత సేవ, ప్రోటోకాల్ దర్శనం, వసతి టికెట్లు ఇప్పిస్తామని నమ్మబలికారన్నారు. దీని కోసం వారు ఆమె నుంచి రూ.2.60 లక్షలు వసూలు చేశారని.. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో తిరుమల 2 టౌన్ పోలీసులు వారిపై కేసు నమోదు చేశామన్నారు.


'కొంతమంది దళారులు దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని చెప్పి భక్తుల నుండి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే దళారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని సివిఎస్వో తెలిపారు. శ్రీవారి దర్శనం కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఆయన భక్తులకు విజ్ఞప్తి చేశారు. దర్శనానికి వెళ్లే సమయంలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది టికెట్లను పరిశీలిస్తారు. ఒకవేళ టికెట్లు నకిలీవిగా తేలితే భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది' అన్నారు.


;శ్రీవారి భక్తులకు మోసపూరిత మాటలు చెప్పి నకిలీ దర్శన టికెట్లు, వసతి కల్పిస్తామని దళారులు ఎవరైనా చెప్పినా నమ్మవద్దు.


దళారులు ఎవరైనా మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేస్తే, డబ్బులు పంపమని ఫోన్ చేస్తే వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులకు తెలియజేయండి. టిటిడి విజిలెన్స్ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే 0877 – 2263828 నెంబర్‌కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. అనుమానాస్పద వ్యక్తులు, దళారులు టికెట్ల పేరుతో మోసాలు చేస్తే వారి వివరాలను వెంటనే టిటిడి విజిలెన్స్ దృష్టికి తీసుకురండి' అన్నారు.


'తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం భక్తులు టిటిడి అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలి. మీ ఆధార్ కార్డు ఉపయోగించి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దళారులను ఆశ్రయించి మోసపోవద్దు' అని టీటీడీ భక్తులను కోరింది.

Latest News
Congress attacks Assam CM over search at Pawan Khera's home, calls it 'witch hunt' Tue, Apr 07, 2026, 02:07 PM
Manipur CM vows strict action after bomb attack kills two kids in Bishnupur Tue, Apr 07, 2026, 01:56 PM
Pawan Khera absconding to evade arrest, says Assam CM Tue, Apr 07, 2026, 01:40 PM
Massive US air operation saves two stranded in Iran: Trump Tue, Apr 07, 2026, 01:39 PM
Disproportionate Assets case: Lokayukta conducts simultaneous raids in 4 Karnataka districts Tue, Apr 07, 2026, 01:28 PM