|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 05:56 PM
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా, అంతర్జాతీయ సర్వీసుల విషయంలో కీలక ప్రకటన చేసింది. జూన్ 21 నుంచి జులై 15 వరకు మూడు విదేశీ మార్గాల్లో విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేయనున్నట్లు తెలిపింది. అలాగే మరో 16 అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసులను తగ్గించనున్నట్లు గురువారం వెల్లడించింది. షెడ్యూళ్లలో స్థిరత్వం తీసుకురావడం, ప్రయాణికులకు చివరి నిమిషంలో కలిగే అసౌకర్యాన్ని తగ్గించడం ఈ చర్యల ముఖ్య ఉద్దేశమని సంస్థ పేర్కొంది.జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో ప్రయాణికుల్లో విశ్వాసం పెంపొందించేందుకు బోయింగ్ 787, బోయింగ్ 777 విమానాలకు అదనపు భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఈ నేపథ్యంలోనే తమ వైడ్-బాడీ విమానాల అంతర్జాతీయ సర్వీసులను సుమారు 15 శాతం మేర తాత్కాలికంగా తగ్గించాలని నిర్ణయించినట్లు బుధవారమే సూచనప్రాయంగా వెల్లడించిన సంస్థ, గురువారం పూర్తి వివరాలను ప్రకటించింది. ఈ సర్దుబాట్లు జూన్ 21 నుంచి జులై 15 వరకు అమల్లో ఉంటాయని ఎయిరిండియా ప్రకటించింది.
Latest News