లక్ష రూపాయల స్కూటీ కోసం రూ.14 లక్షలు ఖర్చు
 

by Suryaa Desk | Fri, Jun 20, 2025, 05:44 PM

కేవలం లక్ష రూపాయల విలువైన స్కూటీకి.. ఏకంగా పద్నాలుగు లక్షల రూపాయలు వెచ్చించి ఒక వీఐపీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను కొనుగోలు చేసి హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి రికార్డు సృష్టించారు. సంజీవ్ కుమార్ అనే వ్యక్తి ఆన్‌లైన్ వేలంలో ఈ అద్భుతమైన ధరను వెచ్చించి 'హెచ్‌పీ21సి-0001' (HP21C-0001) నంబర్ ప్లేట్‌ను సొంతం చేసుకున్నారు. వాహనం ధర కంటే పదిహేను రెట్లు ఎక్కువ మొత్తాన్ని కేవలం నంబర్ ప్లేట్‌కే ఖర్చు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


ఈ వినూత్న వేలం హిమాచల్ ప్రదేశ్ రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో జరిగింది. ఆశ్చర్యకరంగా ఈ కీలకమైన వీఐపీ నంబర్ కోసం కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే పోటీ పడ్డారు. సోలన్ జిల్లాలోని బడ్డీకి చెందిన మరో బిడ్డర్.. ఈ నంబర్ కోసం రూ. 13.5 లక్షలు కోట్ చేశారు. అయితే సంజీవ్ కుమార్ అతనిని అధిగమించి అంతకంటే రూ.50 వేలు ఎక్కువగా పాడారు. ముఖ్యంగా రూ. 14 లక్షలకు ఈ ప్రతిష్టాత్మక నంబర్‌ను దక్కించుకున్నారు.


రవాణా శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్ర చరిత్రలోనే ఒక ద్విచక్ర వాహనానికి ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించి రిజిస్ట్రేషన్ నంబర్‌ను కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి అని చెప్పారు. సంజీవ్ కుమార్ చేసిన ఈ కొనుగోలు.. కేవలం ఒక నంబర్ ప్లేట్‌కు భారీ ధర చెల్లించడమే కాకుండా, పెరుగుతున్న జీవనశైలి మార్పులు, డిజిటల్ వేలం ప్రక్రియల పారదర్శకతపై కూడా చర్చకు తెర లేపింది. ప్రజలు తమ వాహనాలకు ప్రత్యేక గుర్తింపునిచ్చే వీఐపీ నంబర్‌లకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో ఈ ఘటన స్పష్టం చేస్తుంది.


కొంతమందికి వాహనం ధర ముఖ్యం కాగా.. మరికొంతమందికి వాహనం కంటే దాని నంబర్ ప్లేట్‌కే ఎక్కువ విలువ ఇస్తారని ఈ ఘటన రుజువు చేసింది. లక్ష రూపాయల స్కూటీకి 14 లక్షల నంబర్ ప్లేట్ అంటే మొత్తం వాహనం ధర కంటే 15 రెట్లు అధికం కావడం విశేషం. సంజీవ్ కుమార్ తన ఈ ప్రత్యేక నంబర్‌తో రోడ్లపైకి రాగానే అందరి దృష్టినీ ఆకర్షించడం ఖాయం. మరోవైపు ఈ వార్త తెలుసుకున్న నెటిజెన్లు షాక్ అవుతున్నారు. రూ.14 లక్షలతో మంచి లగ్జరీ కారే వచ్చేది కదా.. ఈ నంబర్ అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. లక్ష రూపాయల స్కూటీ కోసం 14 లక్షలు ఖర్చు చేశారంటే.. మీరు ధనవంతులే అంటూ మరికొంత మంది తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు.

Latest News
Chinese tourist's experience in Beijing reveals rapidly expanding system of identity control Sun, Apr 05, 2026, 05:38 PM
Fridge blast kills two in Telangana; separate mishaps claim more lives Sun, Apr 05, 2026, 05:34 PM
US rescues missing fighter jet pilot in Iran, confirms Trump Sun, Apr 05, 2026, 05:13 PM
Pakistan's military behaves more like mercenary force Sun, Apr 05, 2026, 05:10 PM
GT will rue lost opportunities when playoff race heats up: Steyn Sun, Apr 05, 2026, 05:07 PM