|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 02:39 PM
భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా-ఇరాన్ వివాదంపై చర్చలకు అవకాశముందని వెల్లడించడంతో మదుపరులు ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్నం 2:00 PM నాటికి సెన్సెక్స్ 1% పెరిగి 82,185 వద్ద, నిఫ్టీ 1.08% పెరిగి 25,060 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీలో భారతి ఎయిర్‌టెల్, మహీంద్రా, రిలయన్స్ లాభదాయకంగా ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ నష్టపోయాయి.డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసలు బలపడి 86.58గా ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ టాటా మోటార్స్, ట్రెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ, డాక్టర్ రెడ్డీస్ షేర్లు రాణిస్తున్నాయి. హీరో మోటార్స్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి.
Latest News