|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 02:10 PM
ఇప్పటివరకు ఓటరు కార్డును పొందడం కొంత కష్టమైన ప్రక్రియగా కనిపించేదీ. కానీ ఇప్పుడంతా డిజిటల్‌గా జరిగిపోతున్న నేపథ్యంలో, ఇంటి దగ్గరే కూర్చొని కొత్త ఓటరు కార్డుకు ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు. భారత ఎన్నికల సంఘం అందిస్తున్న అధికారిక వెబ్‌సైట్ www.nvsp.in ద్వారా ఈ సేవను పొందవచ్చు.
ముందుగా, వెబ్‌సైట్‌లోకి వెళ్లి కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలి. Create Account పై క్లిక్ చేసి, మీ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ నమోదు చేసి పాస్‌వర్డ్ సెట్ చేయండి. తర్వాత ఈమెయిల్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయాలి. తర్వాత మీ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఇది పూర్తయిన తరువాత, మీరు ఓటర్‌గా నమోదు కావడానికి అవసరమైన దశలను మొదలుపెట్టవచ్చు.
కొత్త ఓటరు అయితే “Form 6” ను ఎంచుకుని మీ వ్యక్తిగత వివరాలు, చిరునామా, పుట్టిన తేదీ మొదలైన వాటిని నమోదు చేయాలి. ఆధార్, వయసును నిరూపించే సర్టిఫికెట్, చిరునామా ప్రూఫ్ వంటి అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి Submit చేయాలి. అప్లికేషన్ స్టేటస్‌ను మళ్లీ అదే వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి ట్రాక్ చేయవచ్చు. ఇలా మీ ఓటరు నమోదు ప్రక్రియను సులభంగా పూర్తిచేయవచ్చు.