|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 12:35 PM
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ అణుస్థావరాలపై దాడికి అమెరికా సిద్ధమవుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూక్లియర్ స్థావరాలపై దాడులు చేసేందుకు అమెరికా ఆదేశాల కోసం వేచి చూడలేమన్నారు. ఇరాన్‌లో అణుకేంద్రాలన్నింటినీ ధ్వంసం చేసే సామర్థ్యం తమ దేశానికి ఉందని నెతన్యాహు పేర్కొన్నారు. ఫోర్డ్‌లోని భూగర్భ అణుకేంద్రంతో సహా ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై దాడి చేయనున్నట్లు తెలిపారు. అయితే, ఇందుకు అమెరికా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేవరకు వేచి ఉండబోమని స్పష్టంచేశారు. ఇప్పటివరకు నిర్వహించిన దాడుల విషయంలో కూడా యూఎస్ ఆదేశాల కోసం వేచి చూడలేదన్నారు. ఈసందర్భంగా ఇరాన్‌లో పరిపాలనను పతనం చేసే ఉద్దేశం తమకు లేదని, అది పూర్తిగా ఆ దేశ ప్రజలకు సంబంధించిన విషయమన్నారు. ఇరాన్‌పై దాడిలో యూఎస్ అధ్యక్షు
Latest News