|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 06:54 PM
జగన్ పాలనలో తప్పు చేసిన వారంతా శిక్ష అనుభవిస్తారని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తప్పు చేసిన వారిని ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న కేసుల విచారణ కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు అధికారం తమకు ఇచ్చింది జగన్, ప్రతిపక్ష నేతలపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడటానికి కాదని స్పష్టం చేశారు. చట్టప్రకారం అందరికీ శిక్షపడేలా చేస్తామని హెచ్చరించారు. తమ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్షసాధింపులు ఉండవని స్పష్టం చేశారు. ఇవాళ(గురువారం) ఢిల్లీలో మీడియాతో నారా లోకేష్ చిట్‌చాట్ చేశారు.రాష్ట్రంలో సుపరిపాలన కోసం ప్రజలు తమకు అధికారం ఇచ్చారని.. వ్యక్తిగత కక్షసాధింపుల కోసం కాదని మంత్రి నారా లోకేష్ అన్నారు. తప్పు చేసిన వారి పేర్లన్నీ రెడ్‌బుక్‌లో ఉన్నాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కుటుంబసభ్యులతో కలవడం మరిచిపోలేనిదని చెప్పారు. క్రమశిక్షణతో ఉండాలని, ప్రకృతిని ప్రేమించాలని దేవాన్ష్‌కి ప్రధాని మోదీ చెప్పారని గుర్తుచేశారు. రెండు రోజులపాటు పలువురు కేంద్రమంత్రులను ఢిల్లీలో కలిశానని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కి మంచి చేయాలన్న తపన వాళ్లందరిలో కనిపించిందని చెప్పారు.
Latest News