|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 04:06 PM
అనంతపురం జిల్లాలో తక్కువ వర్షపాతం ఉన్నందున రైతులు సంప్రదాయ పంటలకన్నా లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. పరిస్థితుల్లో మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటలవైపు రైతుల దృష్టిని ఆకర్షించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
గురువారం ఆమె రామగిరి మండలంలోని చెర్లోపల్లిలో ఖార్జుర సాగు చేస్తున్న రైతు డి. నారాయణప్ప తోటను సందర్శించారు. నారాయణప్ప తన పొలంలో సాగు చేస్తున్న బార్జి రకం ఖార్జుర మొక్కలను పరిశీలించిన ఎమ్మెల్యే, సాగు విధానం, పెట్టుబడి మరియు దిగుబడి వివరాలను తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో ఇలాంటి లాభదాయక పంటల సాగు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని తెలిపారు. రైతులు ఖార్జుర వంటి కొత్త పంటల వైపు దృష్టి సారిస్తే ఆదాయం మెరుగుపడుతుందని సూచించారు.