|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 03:32 PM
ఏపీలో గత కొద్దిరోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కాగా, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాలు, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణ శాఖ సూచించింది.
Latest News