భార్యను శారీరకంగా, మానసికంగా హింసించిన భర్త,,,,నిందితుడికి బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు
 

by Suryaa Desk | Wed, Jun 18, 2025, 06:41 PM

భార్యను చింత్రహింసలకు గురిచేయడమే కాకుండా.. ఇతరులతో శృంగారం చేయాలని ఆమెను బలవంతం చేశాడు. ఏకంగా సోషల్ మీడియాలో ఆమెతో శృంగారం కోసం ప్రకటన ఇచ్చాడు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఈ ఘటనపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అటువంటి వ్యక్తి బయట తిరగడానికి అర్హుడుకాదని, బెయిల్‌ను నిరాకరించింది. సదరు భర్తపై అత్యాచారం, గ్యాంగ్ రేప్, లైంగిక వేధింపులు, క్రూరమైన ప్రవర్తన వంటి అభియోగాలు నమోదయ్యాయి. ఇది సాధారణ గృహహింస కేసు లాంటిది కాదని జస్టిస్‌ గిరీశ్‌ కథపాలియా వ్యాఖ్యానించారు. నిందితుడి బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జూన్ 9న ఇచ్చిన తీర్పులో ఈ అంశాలను ప్రస్తావించారు.


తన భర్తే తనపై పలు సార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చింది. స్నేహితులతో కలిసి తనను ఒక హోటల్‌కు తీసుకెళ్లి, లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆమె ఆరోపించారు. అతడి తమ్ముడు (మరిది) తనను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పినా పట్టించుకోలేదని, భర్త చెప్పినట్టు చేయడం లేదని బ్లేడుతో గాయపరచి అలాగే వంట చేయమని క్రూరంగా ప్రవర్తించేవాడని వాపోయింది. భర్త చేతుల్లో చిత్రహింసలు అనుభవించిన మహిళ ఆవేదనను అర్ధం చేసుకున్న న్యాయస్థానం.. నిందితుడికి బెయిల్ నిరాకరించింది.


‘‘ఇది ఒక సాధారణ గృహహింస కేసుగా పరిగణించలేం. భార్యను ఇతరులతో శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేయడమే కాదు, ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఆమెతో శృంగారం కోసం ఇతరులను ప్రోత్సహించడం చాలా తీవ్రమైన నేరం’ అని జస్టిస్ట్ గిరీశ్ పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరుకాగా.. దుర్వినియోగం చేశాడని.. ఇటువంటి వారికి బెయిల్ ఇవ్వకూడదని అన్నారు. ముందస్తు బెయిల్ సమయంలో నకిలీ పేరు, మొబైల్ నంబరు ద్వారా భార్యకు తరుచూ మెసేజ్‌లు పంపుతూ ఆమెను మరింత మానసికంగా హింసించాడు. చివరకు ఆ సిమ్ అతడి పేరుతోనే రిజిస్టర్ అయినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. మహిళ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి.. ఆమె స్వేచ్ఛను కాలరాసే చర్యలు దుర్మార్గమైనవి న్యాయస్థానం ఈ తీర్పు ద్వారా వెల్లడించింది.


కాగా, మహిళలపై దేశంలో వేధింపులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అత్తింటి వేధింపులతో అనేక మంది మహిళలు ఆత్మహత్యకు పాల్పడుతున్న సంఘటనలు తరుచూ వింటూనే ఉన్నాం. అదనపు కట్నం కోసం వేధించడం, ఉద్యోగాలు చేస్తున్న మహిళలను కూడా పిశాచిలా అత్తింటివాళ్లు వేధింపులకు గురిచేయడం సర్వసాధారణంగా మారిపోయాయి. మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాలను కొందరు దుర్వినియోగం కూడా చేయడం గమనార్హం.

Latest News
Delhi-NCR wakes up to rain, dust storm; heat eases as mercury drops Wed, Apr 29, 2026, 11:36 AM
BJP's intention is to forcefully rig elections: CM Mamata Wed, Apr 29, 2026, 11:34 AM
FIFA chief Infantino applauds PM Modi's football session in Sikkim Wed, Apr 29, 2026, 11:32 AM
Prayed to Lord Bholenath for happiness, well-being of countrymen, says PM Modi Wed, Apr 29, 2026, 11:29 AM
GCC leaders reject Iran's measures to close Strait of Hormuz Wed, Apr 29, 2026, 11:24 AM