|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 11:29 AM
దానిమ్మ పండ్లను ఫ్రిజ్‌లో ఉంచవచ్చా? అనే డౌట్ వస్తుంది. అయితే, సరైన విధంగా నిల్వ చేస్తే తాజాగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. తొక్క తీసిన గింజలను ఎయిర్‌టైట్ కంటైనర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే 4–5 రోజులు నిల్వ ఉంటాయి. తొక్క తీయకుండా ఉంచిన పండ్లు ఫ్రిజ్‌లో 2–3 వారాలపాటు నిల్వ ఉంటాయి. అదే గది ఉష్ణోగ్రతలో అయితే 1 వారంపాటు మాత్రమే ఉంటాయట. కాబట్టి ఫ్రిజ్‌లో ఉంచడం ద్వారా దానిమ్మ ప్రయోజనాలు కొనసాగించవచ్చట.దానిమ్మ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్ , ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. దానిమ్మ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. దీని వినియోగం చర్మాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ దీనిని తీసుకోవడం వల్ల శరీరం శక్తివంతంగా ఉంటుంది.
Latest News